విధాత‌, సినిమా: టాలీవుడ్‌లో ఇంతకు ముందు ఆ నలుగురే.. అని నిర్మాతల విషయంలో బాగా వినిపించేది. ఇండస్ట్రీని కనుసన్నల్లో పెట్టుకుని ఆ నలుగురే అంతా చేస్తున్నారని, వారి చేతుల్లోనే థియేటర్లు ఉండటంతో.. వారి సినిమాలకు తప్పితే ఇతరులకు థియేటర్లు ఇవ్వడం లేదంటూ.. అప్పట్లో ఓ నలుగురు నిర్మాతలను అంతా టార్గెట్ చేసేవారు. ఈ మధ్య ఆ నలుగురి వ్యవహారంపై వార్తలేం లేవు కానీ.. ఇంకా వారి చేతుల్లోనే ఇండస్ట్రీ నడుస్తుందన్నది మాత్రం వాస్తవం. సరే ఆ విషయం […]

విధాత‌, సినిమా: టాలీవుడ్‌లో ఇంతకు ముందు ఆ నలుగురే.. అని నిర్మాతల విషయంలో బాగా వినిపించేది. ఇండస్ట్రీని కనుసన్నల్లో పెట్టుకుని ఆ నలుగురే అంతా చేస్తున్నారని, వారి చేతుల్లోనే థియేటర్లు ఉండటంతో.. వారి సినిమాలకు తప్పితే ఇతరులకు థియేటర్లు ఇవ్వడం లేదంటూ.. అప్పట్లో ఓ నలుగురు నిర్మాతలను అంతా టార్గెట్ చేసేవారు. ఈ మధ్య ఆ నలుగురి వ్యవహారంపై వార్తలేం లేవు కానీ.. ఇంకా వారి చేతుల్లోనే ఇండస్ట్రీ నడుస్తుందన్నది మాత్రం వాస్తవం.

సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని విమర్శలు వివాదంగా మారాయి. టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించినా కూడా సరైన గుర్తింపుకు నోచుకోని అమలాపాల్.. కోలీవుడ్ నటిగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక, దర్శకుడు విజయ్‌తో విడాకులు అయిన తర్వాత తను ఏం చేస్తుందో కూడా తెలియనంతగా.. ఫోటోలతో సోషల్ మీడియాని వేడిక్కిస్తూ వస్తుంది.

ఇప్పుడేదో రెండు అవకాశాలు ఆమెకు వరించడంతో.. టాలీవుడ్‌ని టార్గెట్ చేసి వార్తలలో నిలవడానికి తెగ ఆరాటపడుతోంది. టాలీవుడ్‌లో ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. కానీ.. ప్రేమ, పెళ్లి అంటూ ఒకవైపు.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే అని మరోవైపు.. ఇలా తన పతనం తానే కొనితెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయంటూ కామెంట్స్ చేసి.. ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. హీరోల కుటుంబాలను టార్గెట్ చేయడం ఏమిటో ఆమెకే తెలియాలి.

టాలీవుడ్‌ను ఆ నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయి. ఆ కుటుంబాలలోని హీరోలు, వారి పిల్లలు మాత్రమే ఆ ఇండస్ట్రీలో ఉంటారు. అలాగే అక్కడ హీరో పక్కన నటించడానికి ఇద్దరు హీరోయిన్లు కావాలి. పోనీ ఇద్దరు ఉన్నా.. వారి నటనకు స్కోప్ ఉండదు.

గ్లామర్ ప్రదర్శించడానికి, పాటలకి తప్ప వారికి హీరోయిన్లు అవసరం లేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యతే వేరు అన్నట్లుగా అమలాపాల్ కామెంట్స్ చేసింది.

నిజంగా అమలాపాల్ చెప్పిన ఆ నాలుగు కుటుంబాలే అయితే.. ఈ మధ్య వచ్చిన హిట్స్ ఒక్కసారి గమనిస్తే.. ‘మేజర్’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచేవి కావు. నాని, విజయ్ దేవరకొండ వంటి సాధారణ నటులు స్టార్ హీరోస్ అయ్యేవారు కాదు.

కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఆమె చెబుతున్నట్లుగా.. ఆ ఫ్యామిలీ హీరోల సినిమా ఒక్కటి వస్తే.. ఇతర హీరోల సినిమాలు దాదాపు నాలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.

టాలీవుడ్ రేంజ్ ఏంటో తెలియకుండా అమలాపాల్ మాట్లాడుతుంది. ప్రపంచానికి సౌత్ సినిమా అంటే ఏంటో తెలిపింది టాలీవుడ్డే అనే విషయం అమలాపాల్ గుర్తుపెట్టుకోవాలి. అది వదిలేసి.. అవకాశాలు లేక, రాక.. ఫ్రస్ట్రేషన్‌లో ఏది పడితే అది మాట్లాడితే.. ఆమెకే నష్టం. ఇకనైనా కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.. లేదంటే సిల్లీ ఫెలోగా ఆమెని ట్రీట్ చేసే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు ఆమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Updated On 20 Sep 2022 4:47 AM GMT
Somu

Somu

Next Story