Amala | టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నాగార్జు, అమల జంట ఒకటి. ముందు నాగార్జున దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకొని నాగ చైతన్యకి జన్మనివ్వగా, కొద్ది రోజులకి వారిరువురు విడిపోయారు. ఆ తర్వాత అమలని వివాహం చేసుకున్న నాగార్జున అప్పటి నుండి ఆమెతో చాలా సఖ్యతగా ఉంటున్నాడు. ఇక పెళ్లి తర్వాత అమల పూర్తిగా సినిమాలకి దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఈ మధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమల తనకు […]

Amala |
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నాగార్జు, అమల జంట ఒకటి. ముందు నాగార్జున దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకొని నాగ చైతన్యకి జన్మనివ్వగా, కొద్ది రోజులకి వారిరువురు విడిపోయారు. ఆ తర్వాత అమలని వివాహం చేసుకున్న నాగార్జున అప్పటి నుండి ఆమెతో చాలా సఖ్యతగా ఉంటున్నాడు.
ఇక పెళ్లి తర్వాత అమల పూర్తిగా సినిమాలకి దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఈ మధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమల తనకు నచ్చిన కథలలో కీలక పాత్ర పోషిస్తూ మెప్పిస్తుంది. గత ఏడాది శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో అమ్మ పాత్రలో నటించి అలరించింది.
అమల సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. సినిమా ఫంక్షన్స్‌కి హాజరు కారు. బయట కనిపించడం కూడా చాలా తక్కువ. అయితే ఆమె రీసెంట్‌గా అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో ‘NEO FIESTA 2K23’ కార్యక్రమంకి హాజరైంది.
ఆ కార్యక్రమంలో నాగార్జున ‘హలో బ్రదర్’లోని సూపర్ హిట్ సాంగ్ ‘ప్రియ రాగాలే’ సాంగ్‌కు కాలు కదిపి అందరిని ఆశ్చర్యపరచింది. అప్పట్లో తన డ్యాన్స్‌తో ఎంతలా మైమరచిపోయేలా చేసిందో ఇప్పుడు అదే గ్రేస్‌తో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన తరువాత.. అమల తొలిసారి ఇలా డ్యాన్స్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
అమల డ్యాన్స్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆమెని తెగ పొడిస్తున్నారు లైక్స్ కొడుతూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమల ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేయడం గ్రేట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక అమల భర్త నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తన 99వ సినిమాని ప్రకటించాడు.
నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చారు. ‘నా సామిరంగ’ అనే మాస్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తు న్నారు.. చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 7తోను నాగ్ బిజీగా ఉన్నారు.
నిన్న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో జరిగిన
NEO FIESTA 2K23 లో
చాలా ఏళ్ళ తరువాత అమల గారు డాన్స్ 👌#AmalaAkkineni#Amala pic.twitter.com/NSMuAGVhzL— Lakshmi Bhavani (@iambhavani1) September 3, 2023
