Amala | టాలీవుడ్‌లో తిరుగులేని జోడీలలో నాగార్జు, అమల జంట ఒకటి. నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించి ఆయనని తన నిజ జీవితంలో లైఫ్ పార్ట్నర్‌గా ఎంచుకుంది. నాగార్జున, అమల వెండితెరపై జోడిగా ‘కిరాయిదాదా’ అనే సినిమాలో తొలిసారి నటించగా, ఆ తర్వాత ‘చినబాబు, ‘శివ’,‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ వంటి చిత్రాలలో నటించారు. ఇందులో ఎక్కువ శాతం మంచి హిట్సే ఉన్నాయి. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకి చాలా దూరంగా ఉంది. ఇటీవల […]

Amala |
టాలీవుడ్‌లో తిరుగులేని జోడీలలో నాగార్జు, అమల జంట ఒకటి. నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించి ఆయనని తన నిజ జీవితంలో లైఫ్ పార్ట్నర్‌గా ఎంచుకుంది. నాగార్జున, అమల వెండితెరపై జోడిగా ‘కిరాయిదాదా’ అనే సినిమాలో తొలిసారి నటించగా, ఆ తర్వాత ‘చినబాబు, ‘శివ’,‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ వంటి చిత్రాలలో నటించారు. ఇందులో ఎక్కువ శాతం మంచి హిట్సే ఉన్నాయి.
అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకి చాలా దూరంగా ఉంది. ఇటీవల చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే అమల తన భర్త గురించి, కొడుకు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.
తన భర్త నాగార్జున చాలా మంచి వాడని, ప్రతి విషయంలోను ఎంతో అర్ధం చేసుకుంటూ సపోర్టివ్‌గా నిలుస్తాడని పేర్కొంది. ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ.. చాలా మొండివాడని, ఏ మాత్రం వినే టైప్ కాదు అని, ఏది అనుకుంటే అది జరగాలి అని అనుకుంటాడంటూ అమల చెప్పుకొచ్చింది.
కొన్ని విషయాలలో అఖిల్ కి కోపం వస్తే గట్టిగా అరుస్తాడని.. కొన్నిసార్లు కొట్టడానికి కూడా వెనకాడడని చెప్పిన అమల.. ఆ సమయంలో మనం కూల్ అయిపోతే అప్పుడు తాను కూడా కూల్ అయి సమస్యని సాల్వ్ చేసుకుంటాడని పేర్కొంది. అమల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో ఓ సందర్భంలో అఖిల్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. నాకంటే ఎక్కువగా వాళ్ళ అమ్మతోనే క్లోజ్ గా ఉంటారు.వీరిద్దరూ తల్లి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారని అన్నాడు. అయితే అమల.. అఖిల్ కి నచ్చని పని ఏదైన చేస్తే.. తన తల్లిని కూడా తిడతాడు.
కాకపోతే ఆ సమయంలో అమల ఏం పట్టించుకోకుండా అఖిల్ ని ప్రేమగా దగ్గరకు తీసుకొని తనకి ఏ విషయంలో ఇబ్బంది కలిగిందో అడిగి తెలుసుకుంటుందని నాగార్జున స్పష్టం చేశాడు. ఇక నాగార్జున- అమల తనయుడు అఖిల్ మంచి హిట్ కొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ఒక్కటంటే ఒక్క మంచి హిట్ కూడా పడడం లేదు.
