Amalapaul | మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగులోను పలు సినిమాలలో నటించి అలరించింది. అమలాపాల్ బోల్డ్ అవతారంలో కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ షో పీక్స్ లో ఉంటుంది. ఇక సినిమాలలో సైతం బోల్డ్ లుక్స్ లో కనిపిస్తూ అదరహో అనిపిస్తుంటుంది. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరచింది. అయితే అమలాపాల్ ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్‌తో కూడా […]

Amalapaul |
మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగులోను పలు సినిమాలలో నటించి అలరించింది. అమలాపాల్ బోల్డ్ అవతారంలో కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ షో పీక్స్ లో ఉంటుంది. ఇక సినిమాలలో సైతం బోల్డ్ లుక్స్ లో కనిపిస్తూ అదరహో అనిపిస్తుంటుంది.
ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరచింది. అయితే అమలాపాల్ ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్‌తో కూడా వార్తలలో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో తన రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్య పరచింది.
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ తనకు రెండో పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అంతేకాదు తనకి కాబోయే వాడు చాలా ప్రేమగా, దయగా ఉండాలని పేర్కొంది. అంతేకాదు బెడ్ రూమ్‌లో సింహంలా ఉండాలి, కండలు తిరిగిన దేహంతో పులి ఉండాలని పేర్కొంది అమలాపాల్.
నాకు మా నాన్న ఎంతో ఆదర్శం. ఆయన చాలా దయతో ప్రేమతో ఉంటారు. నేను నా తండ్రిలా దయ, ప్రేమ, ఫన్నీగా ఉండే వ్యక్తిని వివాహమాడతాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మరి అమలాపాల్ కోరుకున్న వ్యక్తి వస్తాడో లేదో చూడాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా సినిమాలకి దూరంగా ఉంటున్న అమలాపాల్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తన ఫాలోవర్స్ తో ఈ బ్లాక్ బ్యూటీ అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది.
ఆ మధ్య అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీస్ లో నటించాలనుందని, ముఖ్యంగా.. అరుంధతి సినిమాలో అనుష్క లాంటి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారాయి.
