Amaravati
- సీఎం వైయస్ జగన్ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు
- వ్యతిరేకంగా రైతులు వేసిన పిటిషన్ కొట్టేసిన కోర్టు ..
విధాత: వారం రోజుల్లోనే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో రెండోసారి ఉత్సాహం నింపే తీర్పు వచ్చింది. అమరావతి భూ కుంభకోణం మీద సిట్ దర్యాప్తును నిలువరించలేమని, దర్యాప్తు చేస్తేనే అందులో దోషాలు.. లొసుగులు తెలుస్తాయని మొన్న సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో జగన్ సర్కారు హుషారు ఐంది. ఇది చంద్రబాబును ఇబ్బంది పెట్టె అంశం కావడంతో టిడిపి శ్రేణులు కాస్త డిఫెన్స్ లో పడ్డాయి.
ఇప్పుడు తాజాగా ఏపీ హై కోర్టులో వచ్చిన తీర్పు సైతం జగన్ కు అనుకూలాగా ఉంది. అంటే అమరావతిలో పేదలకు సైతం ఇళ్ళు ఇవ్వలని భవిస్తూ జగన్ సర్కార్ జీవో 45 తీసుకువచ్చింది. అయితే అమరావతిలో పేదల ఇళ్ళు ఉండరాదంటూ కొందరు రైతుల ముసుగులో టిడిపి కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు.
దీనికి ఈరోజు కోర్టు ఉత్తర్వులు ఇస్తూ అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వడాన్ని ఎలా ఆపుతాం అని, అసలు అవిరైతుల భూములు కావని సీఆర్డీఏ భూములు కావడంతో అవి ఎవరికీ ఇచ్చుకున్నా తాము ఆపలేమని కోర్టు తేల్చేయడంతో చంద్రబాబు వర్గం డీలాపడింది.
రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం జీఓ నంబర్ 45 ఇస్తూ సీఆర్‌డీఏ నుంచి ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు జిల్లాల కలెక్టర్లకు 1134.58 ఎకరాల భూమిని బదిలీ చేసింది. దీనికి గాను ప్రభుత్వం డబ్బులిచ్చి మరీ సీఆర్డీఏ నుంచి భూమిని రూ.1100 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.
మొత్తం పది లేఔట్లలో 48,379 మంది పేదలకు సెంటు చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే దీనిని కోర్టు కొట్టివేయడంతో అమరావతిలో పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పానికి మార్గం సుగమం అయినట్లు ఐంది.
ప్రధానంగా జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలోని 24,587 మంది లబ్ధిదారులకు ఐనవోలు, మందడం, కురగల్లు, నిడమర్రులోనూ, అలాగే గుంటూరు జిల్లాలోని 24,152 మంది లబ్ధిదారులకు మందడం, కృష్ణాయపాలెం, నవులురు, ఐనవోలు, నిడమర్రులో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పది లేఔట్లు కూడా సిద్ధం చేశారు.
ఐతే దీన్ని అడ్డుకునేందుకు టిడిపి చేసిన ప్రయత్నం కోర్టులో వీగిపోయింది. అయితే ఇప్పుడు ఈ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయూయించాలని చూస్తున్నారు. మరోవైపు దీన్ని వైసిపి పేదల విజయంగా చెబుతోంది. తాము పేదలను సైతం అమరావతిలో భాగస్వాములను చేస్తుంటే టిడిపి అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోంది.