Saturday, April 1, 2023
More
    Homelatestఅమెజాన్ ఉద్యోగుల జీతాల్లో స‌గం కోత!

    అమెజాన్ ఉద్యోగుల జీతాల్లో స‌గం కోత!

    విధాత‌: గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌ (AMAZON)లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు భారీ జీతాల కోత‌నే ఎదుర్కొన‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యం, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో వ్యాపార మంద‌గ‌మ‌నం, ప‌డిపోతున్న ఆదాయం-లాభాలు, పెరుగుతున్న వ్య‌యం కార‌ణాల‌తో 18వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్న‌ట్టు (LAYOFFS) సంస్థ‌ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

    ఇప్పుడు మిగిలిన ఉద్యోగుల వేత‌నాల‌నూ త‌గ్గించే దిశ‌గా అమెజాన్ అడుగులు వేస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది 50 శాతం వ‌ర‌కు జీతాల‌ (SALARY)ను కట్ చేయ‌బోతున్న‌ట్టు అక్క‌డి కార్పొరేట్ సిబ్బంది చెప్తున్నారు. హోదా, తీసుకునే వేత‌నం ఆధారంగా ఈ క‌త్తిరింపులుంటాయ‌ని అంటున్నారు. కాగా, గ‌త‌ ఏడాది అమెజాన్ షేర్ల విలువ 35 శాతం ప‌డిపోయింది.

    దేశీయ ప్ర‌ముఖ ఐటీ రంగ సంస్థ‌ల్లో ఒక‌టైన విప్రో (WIPRO) సైతం ఫ్రెష‌ర్ల‌కు స‌గం జీతాల‌కే ప‌నిచేయాలంటూ సందేశాలిచ్చిన సంగ‌తి విదిత‌మే. ముందుగా రూ.6.5 ల‌క్ష‌ల వార్షిక ప్యాకేజీతో తీసుకుంటామ‌ని చెప్పి శిక్ష‌ణ ఇచ్చాక‌.. ఇప్పుడు రూ.3.5 ల‌క్ష‌ల‌కే ప‌నిచేయాల‌ని సంస్థ‌ కోరింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెజాన్ వ్య‌వ‌హారం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంటున్న‌ది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular