విధాత: అంబ భవాని లిఫ్టుతో నేరడుగొమ్ము మండలం సస్యశ్యామలం అవుతుంద‌ని దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం "మన ఊరు.. మన ప్రభుత్వం-మన పథకాలు" కార్యక్రమంలో భాగంగా నేరడుగొమ్ము మండలం బచ్చాపురం గ్రామంలో రూ.20లక్షలు,పెద్దమునిగల్ గ్రామంలో రూ.20లక్షల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.184.56కోట్లతో అంబ భవాని లిఫ్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, ప్రతీ […]

విధాత: అంబ భవాని లిఫ్టుతో నేరడుగొమ్ము మండలం సస్యశ్యామలం అవుతుంద‌ని దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం "మన ఊరు.. మన ప్రభుత్వం-మన పథకాలు" కార్యక్రమంలో భాగంగా నేరడుగొమ్ము మండలం బచ్చాపురం గ్రామంలో రూ.20లక్షలు,పెద్దమునిగల్ గ్రామంలో రూ.20లక్షల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.184.56కోట్లతో అంబ భవాని లిఫ్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ సమైక్యతా భావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుంద‌న్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మహన్మ నాయక్, జడ్పీటీసీ కేతవత్ బాలు, పిఏసీఎస్ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోకసాని తిరపతయ్య, వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, ఎంపీటీసీ వాంకునవత్ బిక్కు, సర్పంచులు కేతవత్ విజయజవహర్లాలు, పంబలా అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి కేతవత్ రవీందర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ వాడిత్య బాలు, పల్స వెంకటయ్య, బైరెడ్డి కొండల్ రెడ్డి, బోడ్డుపల్లి కృష్ణ, కుంభం నరేష్ గౌడ్, ఏలుక రాములు, శ్రీపతి అంజయ్య, బషీర్, దూడ బావోజి, భారత్, ముక్కమల్ల సాయన్న, వంకూనవత్ నాగు నాయక్, చెన్నకేశవులు, రాజు, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మీబాయ్, ఎంఇఓ సౌమ్య నాయక్, పంచాయతీ రాజ్ డిఇ లింగా రెడ్డి, ఏఈ రాజు, నీలా విజయ్, బాణావత్ రవి, అదెపు ముత్యాలు, బకథట్ల అంజి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 5 Jan 2023 10:51 AM GMT
krs

krs

Next Story