నరేష్ చారి సూక్ష్మ కళా నైపుణ్యం
విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు వెంగళం నరేష్ చారి జాతీయ కళా రత్నమహానంది అవార్డు గ్రహీత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈరోజు భారత రాజ్యాంగ రూపకర్త అయిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా నరేష్ చారి వేరుశెనగ గింజ పై ఆయన చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ విధంగా తన దేశభక్తిని చాటుకున్నారు.