Morca Cave విధాత: చిమ్మ చీకటిగా ఉన్న గుహలో ఒంటరిగా 9 రోజుల పాటు చిక్కుకుపోయిన ఓ సాహసికుడు మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డాడు. తుర్కియే (Turkey) లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న టారస్ పర్వత ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి అమెరికాకు చెందిన మార్క్ డికే అనే సాహసికుడు ఈ నెల మొదట్లో అక్కడకు వెళ్లాడు. అక్కడ కొండ ప్రాంతాల్లో తిరుగాడుతూ ఉండగా ప్రమాదవశాత్తు 3,700 అడుగుల లోతు ఉన్న మార్కో అనే గుహ లాంటి ప్రదేశంలో పడిపోయాడు. […]

Morca Cave
విధాత: చిమ్మ చీకటిగా ఉన్న గుహలో ఒంటరిగా 9 రోజుల పాటు చిక్కుకుపోయిన ఓ సాహసికుడు మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డాడు. తుర్కియే (Turkey) లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న టారస్ పర్వత ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి అమెరికాకు చెందిన మార్క్ డికే అనే సాహసికుడు ఈ నెల మొదట్లో అక్కడకు వెళ్లాడు. అక్కడ కొండ ప్రాంతాల్లో తిరుగాడుతూ ఉండగా ప్రమాదవశాత్తు 3,700 అడుగుల లోతు ఉన్న మార్కో అనే గుహ లాంటి ప్రదేశంలో పడిపోయాడు.
డికే పడిపోయిన ఈ గుహ ప్రపంచంలోనే అతి లోతైన మూడో ప్రదేశం కావడం గమనార్హం. అంత ఎత్తు నుంచి పడిపోవడంతో అతడి శరీరంలో తీవ్ర అంతర్గత గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా కావడంతో అక్కడి నుంచి తనకు తానుగా బయటకు రాలేకపోయాడు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన చాలా మందిని గతంలో డికేనే రక్షించాడు. అతడికి ప్రపంచ సాహసికుల్లో మంచి పేరే ఉంది. దాంతో డికే తనకున్న అనుభవంతో గుహలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని తన ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అయితే స్వయంగా బయటకు వచ్చే అవకాశం లేక పోవడంతో సాయం అర్థించాడు.
భౌగోళికంగా అత్యంత దుర్భరమైన ఈ గుహ నుంచి ఒకరిని బయటకు తీసుకురావడం ఎంతో కష్టం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవ్ రెస్క్యూయర్లు 200 మంది ఒక బృందంగా ఏర్పడి తుర్కియేకు పయనమయ్యారు. ముందుగా లోపల తీవ్ర గాయాలతో ఉన్న డికేకు రక్తం పోయిందని గ్రహించి.. బ్లడ్ ఇన్‌ఫ్యూజన్లను లోపలకు పంపారు.
అనంతరం నిలువుగా పైకి లాగడానికి వీలయ్యేలాంటి స్ట్రెచర్‌కు అతడిని కట్టేశారు. తొమ్మిది రోజుల పాటు అతడికి ప్రొటీన్‌లతో కూడిన ద్రవాహారాన్ని అందించడం ద్వారా బలహీన పడకుండా చూశారు. ప్లాస్మా, సీరం సాయంతో అతడి కడుపులో అయిన అంతర్గత గాయాలకు చికిత్స చేసి స్పృహలో ఉంచారు.
మెల్లగా సన్నని ఖాళీల లోంచి ఆ స్ట్రెచర్‌ను బయటకు లాగారు. అలా తొమ్మిది రోజుల చీకటి గుహవాసం తర్వాత డికే బయట పడ్డాడు. తనకు ఎప్పటికప్పుడు వైద్య, ఆహార సాయం అందించిన తుర్కియే ప్రభుత్వానికి ఈ సందర్భంగా అతడు కృతజ్ఞతలు తెలిపాడు.
