Amit Shah | 'ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్టీలు తెలంగాణ స్వాతంత్ర్యోద్యమ చరిత్రను సుదీర్ఘకాలం ప్రజలకు దూరం చేశాయని, విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకూ సంకోచించాయని' కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. విమోచన దినోత్సవం ఒక్కటే ప్రతీది రాజకీయం చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఇస్రో విజయాలు ఇలా అన్నింటినీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాకిస్థాన్‌ పేరు తెర మీదికి వస్తుంది. […]

Amit Shah |

'ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్టీలు తెలంగాణ స్వాతంత్ర్యోద్యమ చరిత్రను సుదీర్ఘకాలం ప్రజలకు దూరం చేశాయని, విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకూ సంకోచించాయని' కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. విమోచన దినోత్సవం ఒక్కటే ప్రతీది రాజకీయం చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఇస్రో విజయాలు ఇలా అన్నింటినీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నది.

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాకిస్థాన్‌ పేరు తెర మీదికి వస్తుంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశం రాజకీయాస్త్రం అవుతుంది. అసలు 1948 సెప్టెంబర్‌ 13 నుంచి 17 వరకు ఏం జరిగిందనేది బీజేపీ నేతలు తెలుసుకోవాలి. ఆపరేషన్‌ పోలో జరగానికి ముందు జరిగిన తర్వాత అంటే సాయుధపోరాట కాలం 1946-51 వరకు చరిత్రంతా అధ్యయనం చేయాలి. అందులో తమకు తామే గొప్ప దేశభక్తులుగా అభివర్ణించుకునే బీజేపీ నేతలు అందులో తమ పాత్ర ఎంత? ఆ కాలంలో తాము చేసిన త్యాగాలు, పోరాటాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలి.

అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ పార్లమెంటులో సమర్థిస్తే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రధాని 2014 అసెంబ్లీ సమయంలోనూ అనంతరం అనేక సందర్భాల్లో పార్లమెంటులోనూ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, విభజన వల్ల నష్టపోతామన్న ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో? తొమ్మిదిన్నరేళ్ల కాలంలో విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఎందుకు ఉన్నాయో? అమిత్‌ షా జవాబు చెప్పాలి.

ఓటు బ్యాంకు రాజకీయాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది. మొన్నటికి మొన్న తమిళనాడు మంత్రి కుల, మత వివక్ష ఏ మతంలో ఉన్నా దాన్ని నిర్మూలించాలన్న దాన్ని సనాతన ధర్మంపై దాడిగా పేర్కొంటూ.. రాజకీయం చేసింది ఎవరు? ఆయన తలకు వెల కట్టి అంతమొదించాలన్నా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

సనాతన ధర్మం పాటించని వారు ఈ దేశ పౌరులు కాదన్నట్టు వారిపై సోషల్‌ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నాఎందుకు స్పందించడం లేదు? అసలు అమిత్‌ షాకు హైదరాబాద్‌ చరిత్ర ఏం తెలుసు అన్న ఎంపీ అసదుద్దీన్‌ వ్యాఖ్యలు వాస్తవమే. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ నగరంలో హిందు, ముస్లింలు గంగా జమునా తహజీబ్‌ వలె సోదరభావంలో కలిసి మెలసి ఉంటున్నవారిలో మతం పేరుతో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నది ఎవరు?

పాత బస్తీ వరకే పరిమితమైన ఒక పార్టీని ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుని హిందువులలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దక్కించుకోవాలనే సంకుచిత రాజకీయాలు చేస్తున్నది ఎవరు? సంక్షేమాన్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు వంటి అనేక అంశాలను పక్కన పెట్టిరాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక వర్గానికి అనుకూలంగా జై భజరంగబలి అని ప్రధాని ప్రచారం చేసిన సంగతి మరిచిపోయారా? ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగానే కదా కన్నడ ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అమిత్‌ షా అప్పుడే మరిచిపోయారా?

తమ రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా కలుస్తామని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ తమ ప్రధాన అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించాక బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌ ప్రజలు మహా ఘట్‌ బంధన్‌ (ఆర్జేడీ జేడీయూ, కాంగ్రెస్‌) కూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ ప్రభుత్వాన్ని కూల్చి అదే జేడీయూతో జత కట్టింది ఎవరు? మహారాష్ట్రలో హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన సుదీర్ఘ కాలం ఎన్డీఏ కూటమిలో కొనసాగింది.

అలాంటి పార్టీని కూడా తమ అధికారం కోసం పక్కనపెట్డమే కాదు నిట్టనిలువునా చీల్చింది బీజేపీ కాదా? బీజేపీ హిందుత్వ నినాదం వేరు ఆపార్టీ రాజకీయాల కోసం అనుసరించే విధానాలు వేరు అన్నది తొమ్మిదిన్నరేళ్ల వారి పాలన చూస్తే అర్థమౌతుంది. అలాంటి బీజేపీ నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలు గురించి మాట్లాడటం అంటే గురివింద గింజ సామెతను గుర్తుచేయడమే!

Updated On 18 Sep 2023 7:48 AM GMT
krs

krs

Next Story