Nalgonda మృతులకు ఇద్దరు సంతానం విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: జిల్లా పాన‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృత్యువాతపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు స్పాట్‌లోనే మృతి చెందారు. పానగల్లు ఉదయ సముద్రం ప్రాజెక్టు దిగువన దంపతులు ఓర్సు విష్ణు, స్వప్న ఈరోజు ఉదయం మాదిరే మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనము వెనుక నుంచి బలంగా దంపతులను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతులు […]

Nalgonda

  • మృతులకు ఇద్దరు సంతానం

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: జిల్లా పాన‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృత్యువాతపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు స్పాట్‌లోనే మృతి చెందారు. పానగల్లు ఉదయ సముద్రం ప్రాజెక్టు దిగువన దంపతులు ఓర్సు విష్ణు, స్వప్న ఈరోజు ఉదయం మాదిరే మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు.

అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనము వెనుక నుంచి బలంగా దంపతులను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లులు ఉండగా.. విష్ణు ఎన్జీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

ఒకే ప్రమాదంలో దంపతులు మృతి చెదంటంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Updated On 19 Sep 2023 7:41 AM GMT
somu

somu

Next Story