Anasuya | వేణు స్వామి ఈ మధ్య ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ చూసినా ఈయన వరుసగా ఇచ్చే ఇంటర్వ్యూలే. ఇతగాడు టాలీవుడ్ సెలబ్రెటీల మీద చెబుతున్న జాతకాలు ఒకటి రెండు నిజం కావడంతో అమాంతం ఈయన గారి రేంజ్ పెరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, హీరోయిన్స్ గురించిన జాతకాలు ఎప్పుడూ నోటి మీదనే ఉంచుకునే వేణుస్వామి.. ఎవరికి ఎలా ఉండబోతుందనే భవిష్యత్ విషయాల మీద టకటకా మాట్లాడేయడం అందులోనూ ముఖ్యంగా సమంత, నాగ చైతన్య […]

Anasuya |

వేణు స్వామి ఈ మధ్య ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ చూసినా ఈయన వరుసగా ఇచ్చే ఇంటర్వ్యూలే. ఇతగాడు టాలీవుడ్ సెలబ్రెటీల మీద చెబుతున్న జాతకాలు ఒకటి రెండు నిజం కావడంతో అమాంతం ఈయన గారి రేంజ్ పెరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, హీరోయిన్స్ గురించిన జాతకాలు ఎప్పుడూ నోటి మీదనే ఉంచుకునే వేణుస్వామి..

ఎవరికి ఎలా ఉండబోతుందనే భవిష్యత్ విషయాల మీద టకటకా మాట్లాడేయడం అందులోనూ ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకులు.. ప్రభాస్ జాతకం ఇలా కొన్ని హైలెట్ కావడంతో ఇప్పటి సినీ రంగంలో చాలా మంది వేణు స్వామిని ఫాలో అవుతున్నారు. ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో ఆయనిప్పుడు ఓ పెద్ద స్వామిజీ, జ్యోతిష్యుడు లేదంటే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడనే చెప్పాలి.

తాజాగా వేణుస్వామి సోషల్ మీడియా లేడీ బాంబ్ అనసూయ గురించి, అల్లు అర్జున్ గురించి వైరల్ కామెంట్స్ చేశాడు. యాంకర్ అనసూయ కెరియర్ ఇకపై పీక్స్‌కి చేరుతుందని, ఆమె త్వరలోనే ఎవరూ ఊహించని రేంజ్‌కి వెళుతుందని, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. బుల్లితెర నుంచి ‘రంగస్థలం’ చేసే వరకూ ఒకలా ఉన్న అనసూయ కెరియర్.. ఆ సినిమా తర్వాత రంగమ్మత్తగా ఒక్కసారే అమాంతం పెరిగిపోయింది.

ఇప్పుడు మొత్తంగా బుల్లితెరనే వదిలేసి సినీ ఇండస్ట్రీలో పాగా వేసేలా చేసింది. ‘రంగస్థలం’ తర్వాత అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రల్లో కనిపిస్తూనే ఉంది. ఇక రెగ్యులర్‌గా హాట్ హాట్ ఫోటో షూట్స్ తోనూ, అప్పుడప్పుడు వెకేషన్లలో దిగిన హాట్ హాట్ బికినీ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వాటికి వచ్చే నెగెటివ్ కామెంట్స్‌కి రిఫ్లయ్ ఇస్తూ.. ఎప్పుడూ ఏదో రకంగా సెన్సేషనల్ కావాలని ప్రయత్నిస్తూనే ఉంది. అదే ఆమెకు ఓరకంగా క్రేజ్ తెచ్చిపెడుతుంది కూడా.

అయితే వేణు స్వామి చెప్పినట్లుగా ప్రస్తుతం ఆమె మంచి పీక్స్‌లోనే ఉంది. ఇప్పుడు వేణు స్వామి చెబుతున్నట్లుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం.. ఇక అనసూయ రేంజ్ మారిపోవడం ఖాయం. అదే జరిగితే అనసూయ ఇంకెన్ని హొయలు పోతుందో ఏమో అంటున్నారు నెటిజన్లు.

ఇక తాజాగా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డుకు ఎన్నికైన అల్లు అర్జున్ గురించి కూడా వేణు స్వామి కొన్ని కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ మరో పదేళ్లు సినీ ఇండస్ట్రీని ఏలతాడని, అతనికి కెరియర్ పరంగా తిరుగుండదని, సినీ ఇండస్ట్రీలోనే ప్రభంజనం కాబోతున్నాడని వేణుస్వామి చెప్పుకొచ్చాడు.ఇక త్వరలో రాబోతున్న ‘పుష్ప2’ అతన్ని మరో మెట్టు ఎక్కించబోతుందని కూడా చెప్పాడు.

ఆయన అన్నట్లుగా ఈ పుష్ప 2‌కు సంబంధించి ఇటీవల వచ్చిన వీడియో, పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ విడుదలై ‘పుష్ప’ కన్నా మంచి కలెక్షన్స్ తెస్తుందని అటు ఫ్యాన్స్.. ఇటు దర్శక నిర్మాతలు భారీ అంచనాలతోనే ఉన్నారు. ఇక ఈ సందర్భంలో వేణు స్వామి మాటలు అభిమానుల చెవుల్లో అమృతం నింపినట్టుగా ఉన్నాయి.

అయితే ఆయన చెప్పినవన్నీ నిజం అవుతాయని నమ్మకానికి లేదని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే.. 2024 సమయానికి పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, అతను పాలిటిక్స్‌లో ఉండటం కానీ జరగదని కూడా వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Updated On 28 Aug 2023 2:16 PM GMT
krs

krs

Next Story