Anasuya | అనసూయ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆమె పబ్లిక్ ఫిగర్. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో.. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యేవారిని అడిగితే తెలుస్తుంది. ఎప్పుడూ వివాదాలతోనూ, అలాగే హాట్ హాట్ ఫొటోలతోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే అనసూయ.. ఇప్పుడు మరోసారి ‘నో లిమిట్స్’ అనేలా భర్తతో కలిసి విచ్చలవిడిగా రెచ్చిపోయింది. అరకొర దుస్తులు, లిప్‌లాక్స్.. అడ్డేడ్డే.. చెప్పడం కంటే.. ఆమె పోస్ట్ చేసిన […]

Anasuya |

అనసూయ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆమె పబ్లిక్ ఫిగర్. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో.. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యేవారిని అడిగితే తెలుస్తుంది. ఎప్పుడూ వివాదాలతోనూ, అలాగే హాట్ హాట్ ఫొటోలతోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే అనసూయ.. ఇప్పుడు మరోసారి ‘నో లిమిట్స్’ అనేలా భర్తతో కలిసి విచ్చలవిడిగా రెచ్చిపోయింది.

అరకొర దుస్తులు, లిప్‌లాక్స్.. అడ్డేడ్డే.. చెప్పడం కంటే.. ఆమె పోస్ట్ చేసిన వీడియోను, ఫొటోలను చూస్తేనే ఆ మజా వస్తుంది. అయితే ఇదంతా అనసూయ ఎందుకు చేసి ఉంటుందని అనుకుంటున్నారా? తన పెళ్లి రోజుని పురస్కరించుకుని.. విదేశాల్లో తన భర్తతో కలిసి అనసూయ విహారయాత్ర చేస్తోంది.

ఓ బీచ్ ఒడ్డున రిసార్ట్‌లో.. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను, వీడియోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను, వీడియోలను చూసిన కొందరు కుళ్లు కుంటుంటే.. ఆమె అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ కపుల్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా అనసూయ భర్తను టార్గెట్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పెళ్లిరోజు సందర్భంగా వీడియోతో పాటు ఒక ఎమోషనల్‌ మెసేజ్‌ కూడా అనసూయ షేర్ చేసింది. అందులో ‘‘23 జనవరి, 2001లో న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో మన దేశ డైరెక్టరేట్స్ మధ్య జరిగిన సాంస్కృతిక పోటీలకు హాజరైనప్పుడు.. నువ్వు నాకోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు తిరిగి సమాధానం చెప్పలేకపోయాను. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.

డియర్ నిక్కూ.. ఇన్నేళ్ల మన బంధం ఇంత గొప్పగా సాగడానికి నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు. ఎంతోమంది నీ గురించి నీచంగా కామెంట్స్ చేశారు. అయినా కూడా ఇసుమంత కూడా ప్రేమ తగ్గనీయకుండా మన ప్రేమబంధాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు.

ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. ఇప్పుడు మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం.

మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు.. కానీ కష్టసుఖాలలో ఒకరికొకరం అండగా నిలబడుతున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం.

నన్ను నన్నుగా స్వాగతించి.. మన వివాహబంధాన్ని ఒక డేటింగ్‌లా సాగేలా అనుమతించినందుకు ధన్యవాదాలు. హ్యాపీ యానివర్సరీ బేబీ’’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను అనసూయ తెలిపింది. అయితే ఈ వీడియోలో ఆమె మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది.

Updated On 6 Jun 2023 1:48 AM GMT
krs

krs

Next Story