Roshan Kanakala | తన వాక్చాతుర్యంతో.. సమయస్ఫూర్తితో అందర్నీ ఆకట్టుకునే యాంకర్ సుమ( Anchor Suma ) కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని సుమ, రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) బుధవారం ప్రకటించారు. అంతే కాదు.. హీరోగా పరిచయం కాబోతున్న రోషన్ కనకాల లుక్‌ను విడుదల చేశారు. సుమక్క కొడుకు సూపర్.. లుక్ అదిరింది అంటూ సినీ ప్రియులు, ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ.. ఆ పిక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ మూవీ పేరును ప్రకటించలేదు. దర్శకుడు రవికాంత్ పేరేపు( Ravikanth Perepu ) దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. ‘క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాలకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక రోషన్ నటిస్తున్న తొలి చిత్రం మహేశ్వరి మూవీస్( Maheshwari Movies ) బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతుండగా, పి విమల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే రోషన్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రోజు.. అతని లుక్‌ను విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డీజేగా వైబ్రెంట్ అవతార్‌లో ఉన్న పోస్టర్‌ను రీలిజ్ చేశారు. రోషన్ గిరజాల జుట్టు, సన్ గ్లాసెస్, డీజే సిస్టమ్( DJ System )లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్ సెట్ ధరించి కనిపించారు.