Saturday, April 1, 2023
More
    HomelatestHanumakonda, Anganwadis l అంగన్వాడీల 36 గంటల నిరసన

    Hanumakonda, Anganwadis l అంగన్వాడీల 36 గంటల నిరసన

    Anganwadis protest, Hanumakonda

    • జిల్లా కలెక్టరేట్ వద్ద మూడవ రోజు ఆందోళన
    • వంటావార్పు, ధర్నా చేసిన అంగన్వాడీలు
    • సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ (Hanumakonda) జిల్లాలో అంగన్వాడీ (Anganwadi) ఉద్యోగులు 36 గంటల నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ముందు గత రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు మూడో రోజు నిరసనలో భాగంగా శుక్రవారం వంటా వార్పు నిర్వహించి ధర్నా కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా తమ నిరసన కొనసాగించనున్నట్లు అంగన్వాడీ ఉద్యోగ ప్రతినిధులు వెల్లడించారు.

    కలెక్టరేట్ (Collectorate) వద్ద టెంటు వేసి అక్కడే భోజనాలు చేసి రాత్రి నిద్రించనున్నట్టు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) (CITU)నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

    రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి

    అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులున్నారు. వీరంతా గత 40 ఏండ్లకు పైగా ఐసీడీఎస్ (ICDS)లో పని చేస్తూ పేదలకు సేవ చేస్తున్నార‌న్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, చట్టబద్ధ సౌకర్యాలేవి లేవు. టీచర్లతో సమానంగా వేతనం, సౌకర్యాలు కల్పిస్తామని ప్రగతి భవన్ సమావేశంలో సీఎం హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.

    అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement benefits) టీచర్లకు రూ. 5లక్షలు, హెల్పర్లకు రూ.3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించి అమలు చేయాలి.

    టీచర్లతో సమానంగా వేతనం, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలి. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులతో పాటు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు (Medical Leaves) అమలు చేయాలంటూ అంగన్వాడీలు కోరుతున్నారు.

    కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కె.జమున, రమాదేవి, శోభారాణి, సమ్మక్క, స్వరూప, నిర్మల, పద్మ సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పుల్లా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular