విధాత: ఐటీ కంపెనీ(IT Company)ల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను భారీగా తొలగించే ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఐటీ సర్వీసుల సంస్థ యాక్సెంచర్‌ (Accenture Plc) 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చే వార్షికాదాయ అంచనానూ, లాభాలను తగ్గించింది. ఉద్యోగుల తొలగింపు రాబోయే 18 నెలల్లో దఫ దఫాలుగా ఉండబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో దాదాపు సగం మంది నాన్‌ బిల్లబుల్‌ కార్పొరేట్‌ ఫంక్షన్స్‌లో ఉన్నవారే అవుతారని వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ […]

విధాత: ఐటీ కంపెనీ(IT Company)ల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను భారీగా తొలగించే ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఐటీ సర్వీసుల సంస్థ యాక్సెంచర్‌ (Accenture Plc) 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చే వార్షికాదాయ అంచనానూ, లాభాలను తగ్గించింది.

ఉద్యోగుల తొలగింపు రాబోయే 18 నెలల్లో దఫ దఫాలుగా ఉండబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో దాదాపు సగం మంది నాన్‌ బిల్లబుల్‌ కార్పొరేట్‌ ఫంక్షన్స్‌లో ఉన్నవారే అవుతారని వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ ఖర్చులనూ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ చైర్‌పర్సన్‌ సీఈవో(CEO) జూలీ స్వీట్‌ (Julie Sweet) ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత త్రైమాసికంలో తమ ఆదాయం 16.1 బిలియన్‌ నుంచి 16.7 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉన్నదని కంపెనీ అంచనా వేసింది. ఐటీ కంపెనీల ఆదాయాలను అంచనా వేసే నిపుణులు కూడా యాక్సెంచర్‌ ఆదాయం 16.64 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని చెప్తున్నారు. వార్షిక రెవెన్యూ వృద్ధి 8%-10% మధ్య ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తున్నది. వాస్తవానికి ఇది 8%-11% మధ్య ఉండొచ్చని గత ఏడాది అంచనా వేశారు.

ఉద్యోగుల తొలగింపు పనిలో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌(Microsoft), అమెజాన్‌(Amazon), ట్విట్టర్‌(Twitter), మెటా(Meta)తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో యాక్సెంచర్‌ చేరింది. 9వేల మందిని తొలగించనున్నట్టు అమెజాన్‌ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇప్పటికే 18వేల మంది ఉద్యోగులను ఆ సంస్థ తీసేసింది. పూర్వ ఫేస్‌బుక్‌ అయిన మెటా ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఈ ఏడాది పదివేల కొలువులు పీకేయనున్నట్టు ప్రకటించింది. కోవిడ్‌ విశ్వమారి సమయంలో మొదలైన కొలువల పీకివేత కార్యక్రమం 2022లో మరింత జోరందుకున్నది.

కంపెనీలు.. తీసేసిన, తీసేస్తున్న కొలువులు

అమెజాన్‌ : 27,000
మెటా : 21,000
యాక్సెంచర్‌ : 19,000
అల్ఫాబెట్‌ : 12,000
మైక్రోసాఫ్ట్‌ : 10,000
సేల్స్‌ఫోర్స్‌ : 8,000
హెచ్‌పీ : 6,000
ఐబీఎం : 3,900
ట్విట్టర్‌ : 3,700
సీగేట్‌ : 3,000

Updated On 23 March 2023 2:30 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story