HomelatestAmerican Decline | అమెరికాకు మరో ఎదురు దెబ్బ.. లాటిన్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం

American Decline | అమెరికాకు మరో ఎదురు దెబ్బ.. లాటిన్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం

  • చైనాతో హోండురస్‌ దౌత్య సంబంధాలు

విధాత: మూలిగే నక్క మీద తాటి పండు పడితే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అమెరికా (America) పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. చైనా (China)ను కట్టడి చేద్దామని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అనేక సర్కస్ ఫీట్లు చేస్తున్నది. ఆస్ట్రేలియా యూరప్ దేశాలతో కలిసి జట్లు కడుతున్నది.

కానీ తన తలవాకిట గల సెంట్రల్ అమెరికాలోని దేశమైన హోండురస్ (Honduras) తైవాన్ ను గుర్తించడం మానేసి చైనాతో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నది. దీంతో మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో (Latin America) చైనా ప్రాభవం పెరుగుతున్నదనేది మరోసారి వెల్లడైంది.

ప్రపంచదేశాలన్నీ చైనా నే అసలైన చైనా దేశంగా గుర్తిస్తాయి. తైవాన్ తమ దేశంలోని భాగమని చైనా చెబుతుంది. భారత్ మొదలైన దేశాలన్నీ చైనానే అసలైన చైనాగా గుర్తిస్తాయి. అమెరికా కూడా తైవాన్‌తో అనధికారిక సంబంధాలనే పెట్టుకుంటుంది. కానీ చిన్నా చితకా దేశాలతో తైవాన్ ను అసలైన చైనాగా గుర్తించే విధంగా చేస్తూ ఉంటుంది.

ఇది చైనాను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే. మార్షల్ ఐలాండ్స్, నవురు, పలవు, తువాలు, ఎస్వాటిని, వాటికన్ సిటీ, బెలైజ్, గ్వాటెమాల, హైతీ, పరాగ్వే, సెయింట్ కిట్స్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ వంటి దేశాలు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు.

ఇటువంటి చిన్న దేశాలు అమెరికా ఒత్తిడి మూలంగా తైవాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ సెంట్రల్ అమెరికా దేశమైన హోండురస్ ఇటీవల తైవాన్‌తో తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నది. తైవాన్ తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.

1949లో మావో నాయకత్వంలో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చియాంగ్ కై షెక్ నాయకత్వంలోని కొమింగ్‌టాంగ్‌ పార్టీ వారు తైవాన్‌కు వెళ్ళిపోయారు. అక్కడ చేరి తమదే అసలైన చైనా అని వాదించడం మొదలుపెట్టారు.

కానీ 1971 నాటికి ఐక్య రాజ్యసమితి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనానే అసలైన చైనాగా గుర్తించింది. దీంతో తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏకాకిగా మారిపోయింది. కానీ అమెరికా చైనాను ఇరుకున పెట్టడానికి తైవాన్‌ను కాపాడుతూ వస్తున్నది. ఇప్పడు తాజా పరిణామాలు అమెరికాకు ఎదురుదెబ్బగా పరిణమిస్తున్నాయి

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular