విధాత: దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి మరో మహా కూటమి ఏర్పాటు కాబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి బీజాలు పడబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లారు. సోనియాతో ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు. బీహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత తొలిసారి సోనియా, నితీశ్ భేటీ అయ్యారు. విపక్షాలను ఒకే కూటమి కిందకు తీసుకొచ్చే […]

విధాత: దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి మరో మహా కూటమి ఏర్పాటు కాబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి బీజాలు పడబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లారు. సోనియాతో ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు.
బీహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత తొలిసారి సోనియా, నితీశ్ భేటీ అయ్యారు. విపక్షాలను ఒకే కూటమి కిందకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ భేటీ జరిగింది. రానున్న రోజుల్లో మరికొంతమంది ప్రాంతీయ పార్టీల అధినేతలతో సోనియా భేటీ కానున్నారని సమాచారం.
బీహార్‌లో ఏర్పాటు చేసినట్టు మహా ఘట్ బంధన్, మహారాష్ట్రలో ఏర్పాటు చేసినట్టు మహా వికాస్ అఘాడీ లెక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే పార్టీలను కలుపుకుని వెళ్లాలని, వారందరితో కలిసి జాతీయ స్థాయిలో మరో గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
అలాగే ఎల్లుండి జరగబోయే సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరైతే బాగుంటుందని లాలూ, నితీశ్ భావిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఈ నెల మొదట్లో నితీశ్ కుమార్ ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో చికిత్స కోసం సోనియాగాంధీ విదేశాల్లో ఉన్నారు.
