Wednesday, December 7, 2022
More
    Homelatestఅల్లు అరవింద్ చేతికి మరో ‘KGF’.. ఇక్కడా దుమ్ము రేపుతుందా?

    అల్లు అరవింద్ చేతికి మరో ‘KGF’.. ఇక్కడా దుమ్ము రేపుతుందా?

    విధాత: అల్లు అరవింద్ చేతికి మరో ‘KGF’ అనగానే.. ‘KGF పార్ట్ 3’ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని అనుకుంటారేమో.. కానీ అలాంటిదేమీ లేదు. ఇటీవల KGF బ్యానర్ అయిన హోంబలే ఫిల్మ్స్‌లో విడుదలైన కన్నడ చిత్రం.. ఆ సినిమా మాదిరిగానే కన్నడలో సంచలనాలను క్రియేట్ చేస్తోంది.

    కంటెంట్ పరంగానూ, కలెక్షన్ల పరంగానూ.. దాదాపు ఆ సినిమానే పోలి ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఎవరు అందిస్తున్నారో తెలుసా? మెగా నిర్మాత అల్లు అరవింద్. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా.. ‘కాంతారా’.

    హోంబలే ఫిల్మ్స్, రిషబ్ షెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌లతోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. మరో కన్నడ KGFగా పేరొందింది.

    ఇప్పుడా చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అల్లు అరవింద్ సొంతం చేసుకుని.. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా తెలుగు ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూశాక.. KGF అని అనలేం కానీ.. అంతకంటే ఇంకా గొప్ప కంటెంటే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది.

    ముఖ్యంగా అడవి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. ‘కాంతారా’ అంటే సంస్కృత భాషలో అడవి అని అర్థం. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ, భావోద్వేగాలతో పాటు గ్రామీణ వాతావారాన్ని ఆహ్లాదకరంగా ఈ ట్రైలర్‌లో చూపించారు.

    ట్రైలర్ చూస్తుంటే.. ఇది సామాన్యమైన సబ్జెక్ట్ కాదనేది అర్థమవుతుంది. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమా విషయానికి వస్తే.. బెల్‌బాటమ్‌, హీరో చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన రిషబ్ శెట్టి ఈ చిత్రంలో నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

    హోంబలే ఫిలింస్ బ్యానర్ గురించి చెప్పుకోవాలంటే.. పాన్ ఇండియా సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ బ్యానర్‌ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ‘సలార్’ రూపొందుతోన్న విషయం తెలిసిందే.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page