Tirumala | విధాత: తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. నెల రోజులుగా చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఓ చిన్నారి ప్రాణాన్ని సైతం బలిగొన్నాయి. అప్రమత్తమైన అటవీ, టీటీడీ అధికారులు సంయుక్తంగా చిరుతలను బంధించే పనిలో పడ్డారు. ఈక్రమంలో నడకమార్గం వెంబడి ట్రాప్ కెమెరాలు, బోన్లు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిఘా పెట్టారు. ఇప్పటికే నాలుగు చిరుతలను బోన్లలో బంధించారు. ఇక చిరుతల బెడద తప్పిందని భక్తులు, అధికారులు […]

Tirumala | విధాత: తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. నెల రోజులుగా చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఓ చిన్నారి ప్రాణాన్ని సైతం బలిగొన్నాయి. అప్రమత్తమైన అటవీ, టీటీడీ అధికారులు సంయుక్తంగా చిరుతలను బంధించే పనిలో పడ్డారు. ఈక్రమంలో నడకమార్గం వెంబడి ట్రాప్ కెమెరాలు, బోన్లు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిఘా పెట్టారు. ఇప్పటికే నాలుగు చిరుతలను బోన్లలో బంధించారు.
ఇక చిరుతల బెడద తప్పిందని భక్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే తాజాగా మరో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కింది. అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత కనిపించినట్టు తెలిపారు. దానిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
