Anushka కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల అనుష్క ఇటీవల సినిమాలు పెద్దగా చేయడం లేదు. సైలెన్స్` సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత భాగమతి అనే చిత్రం చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లకి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో వెండితెరపై సందడి చేయనుంది. మహేష్‌బాబు. పి అనే నూతన దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క నటించడం అందరిని షాక్‌కి గురి చేసింది. […]

Anushka
కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల అనుష్క ఇటీవల సినిమాలు పెద్దగా చేయడం లేదు. సైలెన్స్' సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత భాగమతి అనే చిత్రం చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లకి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రంతో వెండితెరపై సందడి చేయనుంది.
మహేష్‌బాబు. పి అనే నూతన దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క నటించడం అందరిని షాక్‌కి గురి చేసింది. సెప్టెంబర్7న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా, ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వేగవంతం చేశారు. ముఖ్యంగా చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.
చిత్ర కథానాయిక అనుష్క ఎక్కడ కనిపించడం లేదు. అనుష్క ఎందుకుప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఆ మధ్య ఎఫ్ ఎం రేడియోలో, అలాగే టీవీ ఛానెల్‌లో నవీన్ పొలిశెట్టితో ప్రాంక్ కాల్‌లో మాట్లాడి సందడి చేసిన అనుష్క డైరెక్ట్‌గా మాత్రం కనిపించడం లేదు.
ఈ క్రమంలో నవీన్ పోలిశెట్టిని దీనిపై ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ అనుష్క ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉందని అన్నాడు. ఓ గ్రూప్ ఇంటర్వ్యూలో తాను పాల్గొందని, త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అనుష్క కూడా తనవంతు ప్రమోషన్స్ చేస్తూనే ఉందని స్పష్టం చేశాడు.
సైజ్ జీరో తర్వాత అనుష్క బరువు భారీగా పెరిగింది. ఆ బరువు తగ్గించుకునేందుకు నానా కష్టాలు పడుతుంది. మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయని, దాని కారణంగా ఆమె వెయిట్ లాస్ కావడం లేదని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి సినిమా రిలీజ్ మరో రెండు రోజులు మాత్రమే ఉండగా ఆమె దర్శనం కలగడం కష్టమే అంటున్నారు.
ఇక అనుష్క, తాను పెయిర్‌గా నటించడానికి కారణం ఏంటనేది మాత్రం సినిమా చూస్తే తెలుస్తుందని, దానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నాడు నవీన్ పోలిశెట్టి. 'జాతి రత్నాలు' మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను, కాని ఇలాంటి కథ కోసం చాలా ఎదురు చూశానని నవీన్ స్పష్టం చేశాడు.
