Anushka Shetty | నటన పరంగా ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది, అలాగే అందం, అణకువ అన్నీ కలగలిసిన సుగుణాల రాశి అనుష్క. అందరి నుంచి స్వీటీగా, మంచి మనసున్న మనిషిగా పేరుతెచ్చుకున్న అనుష్క.. పెళ్ళి సంగతికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తుంది. ఈ ఆరడుగుల అందగత్తెకు తగిన వరుడు ఇంకా దొరక్కపోవడానికి వెనుక కారణాలు సరిగా తెలియకపోయినా పెళ్ళేప్పుడని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నటనకు చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క దాదాపు చాలా […]

Anushka Shetty |
నటన పరంగా ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది, అలాగే అందం, అణకువ అన్నీ కలగలిసిన సుగుణాల రాశి అనుష్క. అందరి నుంచి స్వీటీగా, మంచి మనసున్న మనిషిగా పేరుతెచ్చుకున్న అనుష్క.. పెళ్ళి సంగతికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తుంది. ఈ ఆరడుగుల అందగత్తెకు తగిన వరుడు ఇంకా దొరక్కపోవడానికి వెనుక కారణాలు సరిగా తెలియకపోయినా పెళ్ళేప్పుడని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
నటనకు చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క దాదాపు చాలా కాలం తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో కనిపించబోతుంది. ఈ సినిమా యువీ క్రియేషన్స్‌పై తెరకెక్కగా పి. మహేశ్ బాబు డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన పెళ్లి గురించి ఆసక్తిరకమైన విషయాలను పంచుకుంది.
ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. నా పాత్ర పేరు అన్విత, ఎంతో చక్కని అమ్మాయి. ఏదైనా సాధించాలనే పట్టుదల, మంచితనం కల అమ్మాయి. నా కెరీర్‌లో నేను చేసిన దేవసేన, జేజమ్మ, భాగమతి పాత్రలలో ఉన్న ప్రత్యేకతలానే ఈ అన్విత పాత్ర కూడా చాలా భిన్నమైనది. ఇలాంటి రోల్స్ చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి.
నేను నటించడం ప్రారంభించిన కొత్తలో.. నాకు ఎలాంటి అవగాహనాలేదు. ఇప్పుడు ఓ స్థాయికి రాగలిగానంటే దాని వెనుక ఎందరో చేసిన సహాయం, నేర్పిన మెళకువలు ఉన్నాయి. చాలా సినిమాలు చేసినా కూడా మొదటిసారి సెట్స్‌కి ఎలా వెళ్లానో అలాగే వెళతాను. అలాగే.. నా పాత్రకు న్యాయం చేశానా లేదా? అది మాత్రమే చూసుకుంటాను. ఎన్ని పాత్రలు చేసినా.. ఇంకా గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే కోరిక మాత్రం ఎప్పటికీ ఉంటుంది.
ఇక బరువు పెరగడం, పెళ్ళి విషయాల మీద కూడా అనుష్క స్పందించింది. నటులకు బరువు పెరగడం, తగ్గడం అనేది సవాలుగా మారుతుంది. అన్నీ స్వీకరించ గలిగితేనే ఇక్కడ కొన్నాళ్ళ పాటు ఉండగలిగేది. నేను పెళ్ళికి కూడా వ్యతిరేకిని కాను. వివాహ వ్యవస్థపై గౌరవం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పుకొచ్చింది స్వీటీ. అనుష్క నోటి నుంచి పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి అందరికీ ప్రభాసే గుర్తొస్తాడు. ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది కూడా.
అలాగే వయసు రీత్యా కూడా వీరిద్దరూ ఒక్కటి కావాలని అంతా కోరుకుంటున్నారు. అనుష్క పెళ్లి అనగానే.. ప్రభాస్‌ని చేసుకోమంటూ.. సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్స్ స్టార్ట్ చేశారు. వారేమో.. మేం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అస్తమానం చెబుతూ ఉన్నారు. మరి చివరికి వీరిద్దరే పెళ్లి చేసుకుంటారా? లేక వేరువేరుగా వేరొకరిని చేసుకుంటారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటారు? వంటి ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.
