AP Inter Revaluation విధాత‌: ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు బాగా రాయలేదనో, ఫెయిల్‌ అవుతామనో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అధికారుల నిర్లక్ష్యమో, మూల్యాంకంలో లోపాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో వింతలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి ఫిజిక్స్‌ -2 లో ఇలాగే జరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఆ అమ్మాయి ఈవెరిఫికేషన్‌, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను […]

AP Inter Revaluation

విధాత‌: ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు బాగా రాయలేదనో, ఫెయిల్‌ అవుతామనో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అధికారుల నిర్లక్ష్యమో, మూల్యాంకంలో లోపాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో వింతలు వెలుగులోకి వచ్చాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి ఫిజిక్స్‌ -2 లో ఇలాగే జరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఆ అమ్మాయి ఈవెరిఫికేషన్‌, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు మంగళవారం విడుదల చేసింది. దీంతో అసలు విషయం బైటపడింది.

రీవెరిఫిఖేసన్‌లో 60 మార్కులకు గాను 59 వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంతో ఆ అమ్మాయి మానసిక ఆందోళనకు గురైంది. కొంతమంది అధికారుల అలసత్వంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని, ఒకటిరెండు సార్లు జాగ్రత్తగా ఫెరిఫికేషన్‌ చేసిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని తల్లిదండ్రులు అంటున్నారు.

Updated On 17 May 2023 12:42 PM GMT
Somu

Somu

Next Story