విధాత: ఘోరం.. తలెత్తుకోలేని పరాభవం.. ఛీ ఛీ.. సిగ్గుతో చచ్చిపోవాలనుకునే అవమానం.. అవును నిన్నటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీవీఎన్ మాధవ్ మళ్ళీ బీజేపీ తరఫున గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు.. ప్రధాన పోటీదారు అవుతారనుకున్న ఆయన ఆఖరికి చెల్లని ఓట్లు తుక్కు..పనికిరాని తాలు సరుకుకన్నా ఘోరమైన ఫలితం సాధించారు.
చెప్పుకోవడానికి సైతం సిగ్గుపడే స్థాయిలో ఓట్లు తెచ్చుకుని.. క్యాడర్ మొత్తానికి సిగ్గు వచ్చేలా మిగిలి పోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పడ్డ ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువ.. ఇపుడు పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్ల కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయంటే అంతకు మించిన అవమానం ఏముందీ.
ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీట్లో బీజేపీ పోటీ చేసింది. ఆ సీటు ఈ రోజు దాకా బీజేపీదే. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తే ఆయనకు మొత్తం పోలైన రెండు లక్షల ఓట్లలో వచ్చినవి 11000 మాత్రమే. ఇక్కడ చెల్లని ఓట్లు దాదాపు పన్నెండు వేలు ఉన్నాయి.
తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు రాగా అక్కడ బీజేపీకి ఆరు వేల కంటే తక్కువే ఓట్లు వచ్చాయ్. అదే విధంగా పశ్చిమ రాయలసీమలోనూ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు కానీ అక్కడ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. మొత్తానికి జాతీయ స్థాయి పార్టీ ఇంత ఘోరమైన ఫలితాలు సాధిస్తుందని అనుకోలేదు