విధాత: ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శాఖను ఏర్పాటు చేసి జాతీయ స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ దూకుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లెం వేసింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతున్నా విభజన చట్టంలోని షెడ్యూల్ 9 10 సంస్థలను.. తక్షణమే విభజించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఏపీ […]

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శాఖను ఏర్పాటు చేసి జాతీయ స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ దూకుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లెం వేసింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతున్నా విభజన చట్టంలోని షెడ్యూల్ 9 10 సంస్థలను.. తక్షణమే విభజించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.

దీనిలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం అవుతున్నాయని ఏపీ పేర్కొంది.

ఈ సంస్థల విలువ దాదాపు రూ.142601 కోట్లుగా ఉందని ఎపీ ప్రభుత్వం పిటిషన్లలో వివరించింది. ఉమ్మడి ఏపీకి చెందిన సంస్థల ప్రధాన కార్యాలయాల్లో 91 శాతం సంస్థలు తెలంగాణలో ఉన్నాయని , ఈ సంస్థల విభజన ఆలస్యం వల్ల ఏపీ నష్టపోతోందని పిటిషన్లో వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో విస్తరించాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందరి కాళ్లకు ఏపీ వైసీపీ సర్కారు బంధం వేసేసింది.

ఇప్పటి వరకు ఎటూ తేల్చకుండా.. తేల్చడానికి కూడా ఇష్టపడని విభజన చట్టంలోని అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన జరిగి.. 8 ఏళ్లు పూర్తయిపోయినా.. ఇప్పటి వరకు వాటిపై పట్టించుకోలేదని.. తెలంగాణ సర్కారు వీటిని తేల్చేందుకు ఇష్ట పడడం లేదని విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో ఏపీకి రావాల్సిన వాటా ఇబ్బకుండా తాత్సారం చేస్తూ కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాలో తన పార్టీని ఎలా విస్తరిస్తారు? ఆంధ్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్పి ప్రజల్లోకి వెళ్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

తమను మోసం చేస్తున్నారని ఏపీ ప్రజలు భావిస్తే మరి ఆయనకు, ఆ పార్టీకి మద్దతు ఇస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల టైం చూసుకుని ఏపీ సర్కారు భలేగా కేసీఆర్ను ఇరుకున పెట్టిందని అంటున్నారు. దీనికి మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Updated On 10 Jan 2023 2:02 AM GMT
krs

krs

Next Story