రాజకీయాలతో ముడిపడిన ప్రశ్న వేయొద్దని ఘాటుగా హెచ్చ‌రిక విధాత: మెగాస్టార్ చిరంజీవి ఒకనాడు కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవిలో ఇప్పుడు రాజకీయ వైరాగ్యం బాగా వచ్చింది. రాజకీయాలను మాట్లాడడానికే ఆయన ఇష్టపడటం లేదు. ఎవరైనా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే ఆయన వాటి నుంచి తప్పించుకోవాలని చూడకుండా.. […]

రాజకీయాలతో ముడిపడిన ప్రశ్న వేయొద్దని ఘాటుగా హెచ్చ‌రిక

విధాత: మెగాస్టార్ చిరంజీవి ఒకనాడు కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవిలో ఇప్పుడు రాజకీయ వైరాగ్యం బాగా వచ్చింది. రాజకీయాలను మాట్లాడడానికే ఆయన ఇష్టపడటం లేదు. ఎవరైనా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే ఆయన వాటి నుంచి తప్పించుకోవాలని చూడకుండా.. రాజకీయాల గురించి నన్ను అడగొద్దు అంటూ ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.

ఇక విషయానికొస్తే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి 6 షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైసీపీ ప్రభుత్వం 25 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఆదేశాలిచ్చింది. ఈ సినిమా విడుదలై మంచి టాక్ వస్తే మాత్రం మరోసారి ఇండస్ట్రీ హిట్ ఖాయమని మెగా అభిమానులు అంటున్నారు.

తమ హీరో మెగా విశ్వరూపం వెండితెరపై చూపిస్తే మేమందరం టికెట్ కొని థియేటర్లలో మా విశ్వరూపం చూపిస్తామంటున్నారు. కాగా, చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. తాజా ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న చిరు ఎదురైంది. దీనికి చిరు సమాధానం ఇస్తూ.. ఏపీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్ చేశారు.

ఏపీ రాజకీయాలను నేను పరిశీలించడం లేదు. మీరు పరిశీలించిన దానిలో పావు శాతం కూడా నేను పట్టించుకోవడం లేదు. నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ వెళ్తానంటే అది వారి ఇష్టం. ఎవరి స్వతంత్రం వారిది.

నా కుటుంబంలోని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు కదా అని నేను కూడా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి నన్ను రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పలు మీడియాలో చిరు కామెంట్స్‌ని బ్రేకింగ్ న్యూస్ గా వేస్తున్నాయి. చిరులో రాజకీయ వైరాగ్యం బాగా పెరిగిందని ఈ వ్యాఖ్య‌ల ద్వారా అర్థమవుతుంది.

Updated On 13 Jan 2023 3:44 AM GMT
krs

krs

Next Story