Aparna Balamurali: అపర్ణ బాలమురళి (‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఫేమ్) ఈమె మలయాళ‌ నటి. తన తదుపరి చిత్రం త‌న్క‌మ్ ప్రమోషన్స్‌లో భాగంగా తన సహనటుడు వినీత శ్రీనివాస్‌తో కలిసి అపర్ణ బాలమురళి కేరళలోని ఒక లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజిపై కూర్చొని ఉండగా ఓ విద్యార్థి అక్కడకు వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం కుర్చీలో కూర్చున్న ఆమె చేయి పట్టుకుని పైకి లాగాడు. దీంతో చేసేది లేక ఆమె […]

Aparna Balamurali: అపర్ణ బాలమురళి (‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఫేమ్) ఈమె మలయాళ‌ నటి. తన తదుపరి చిత్రం త‌న్క‌మ్ ప్రమోషన్స్‌లో భాగంగా తన సహనటుడు వినీత శ్రీనివాస్‌తో కలిసి అపర్ణ బాలమురళి కేరళలోని ఒక లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజిపై కూర్చొని ఉండగా ఓ విద్యార్థి అక్కడకు వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

అనంతరం కుర్చీలో కూర్చున్న ఆమె చేయి పట్టుకుని పైకి లాగాడు. దీంతో చేసేది లేక ఆమె నిల్చోగానే ఆ యువకుడు భుజంపై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ఆమె అతని నుంచి దూరంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా ప‌లువురు నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. ఎర్నాకులం న్యాయ కళాశాల విద్యార్థి అనుచిత ప్ర‌వ‌ర్త‌న నన్నెంతో బాధించింది. అదొక తీవ్రమైన చర్య. ‘లా’ను అభ్యసిస్తున్న వ్యక్తి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమని తెలియదా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైన పద్ధతి కాదు.

నా భుజాలపై తను చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. అయితే దీనిపై నేను పోలీసులకు ఏమీ ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు చేసి దాని వెనుక పరుగెత్తే సమయం నాకు లేదు. కానీ స‌ద‌రు విద్యార్థి చర్యను మాత్రం ఖండిస్తున్నాను. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు నాకు క్షమాపణలు చెప్పారని ఆమె వివరించింది.

కాగా యువకుడిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. వారం రోజులపాటు సస్పెన్షన్ విధించిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి లా కాలేజీ ఆ నటికి క్షమాపణ చెబుతూ ఓ లెట‌ర్ విడుదల చేసింది. ఆ కళాశాల యూనియన్ ఈ లేఖలో లా కళాశాలలో ఓ కార్యక్రమానికి హాజరైన నటికి ఇలాంటి సంఘటన ఎదురు కావడం నిజంగా దురదృష్టకరం.

ఈ సంఘటన జరిగిన వెంటనే యూనియన్ అధికారి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇబ్బంది కలిగేలా చేసినందుకు మరోసారి క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సదరు విద్యార్థి‌పై కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొంది.

Updated On 23 Jan 2023 1:18 AM GMT
krs

krs

Next Story