i Phone 15 యాపిల్‌ యూజర్లకు శుభవార్త. కంపెనీ కొత్తగా ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేసింది. అమెరికా కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో కంపెనీ కొత్త యాపిల్‌ ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఫోన్లు ఏ17 బయోనిక్ ప్రాసెసర్లపై పని చేస్తాయని కంపెనీ ప్రకటించింది. యాపిల్ వాచ్ అల్ట్రాలో […]

i Phone 15

యాపిల్‌ యూజర్లకు శుభవార్త. కంపెనీ కొత్తగా ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేసింది. అమెరికా కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో కంపెనీ కొత్త యాపిల్‌ ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త ఫోన్లు ఏ17 బయోనిక్ ప్రాసెసర్లపై పని చేస్తాయని కంపెనీ ప్రకటించింది. యాపిల్ వాచ్ అల్ట్రాలో అందించిన ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను ఈ సిరీస్‌లో అందించింది. ఛార్జింగ్ కోసం లైట్‌నింగ్ పోర్టు కాకుండా యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఇచ్చింది.

ఐఫోన్ 15 ప్రో ధ‌ర‌ ఎంతంటే..

భారత్‌లో ఐఫోన్‌ 15 ధర రూ.1,34,900 నుంచి మొదలవనున్నది. ఇది 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇందులో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,44,900 నిర్ణయించింది. 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,64,900 పలుకుతుండగా.. వన్‌ టీబీ వేరియంట్ ధరను రూ.1,84,900 విక్రయించినట్లు పేర్కొంది. వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుండగా.. సేల్స్‌ 22 నుంచి షురూ కానున్నాయి.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధ‌ర‌

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర భారత్‌లో రూ.1,59,900 నుంచి మొదలవుతుంది. ఇది 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్‌. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 128 జీబీ నుంచి కాకుండా 256 జీబీ నుంచి షురూ అవుతుంది. ఇందులో 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,79,900 కాగా.. 1 టీబీ వేరియంట్ రేటును రూ.1,99,900 కంపెనీ నిర్ణయించింది.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ప్రీ ఆర్డర్స్‌ సైతం ఈ నెల 15 నుంచి మొదలై.. సేల్స్‌ 22 నుంచి ప్రారంభం అవుతాయి. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ మోడల్స్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు అందబాటులో ఉన్నాయి. అయితే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్ దాదాపు రూ.2లక్షలకు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా నిలిచింది.

ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్‌..

ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఇచ్చింది. దీని పీక్ బ్రైట్‌నెస్ట 2000 నిట్స్‌ ఉండనున్నది. అదనపు రక్షణ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ సైతం ఈ స్మార్ట్ ఫోన్లలో అందించారు. యాపిల్ కొత్త 3ఎన్ఎం ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పని చేస్తాయి.

ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు సైతం కొత్త సిరీస్‌ ఫోన్లలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లను గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియం సబ్ స్ట్రక్చర్‌తో రూపొందించగా.. ఫోన్‌ మరింత బలంగా ఉండడంతో పాటు తేలికగా ఉండనున్నది. అయితే, మ్యూట్‌ బన్‌ స్థానంలో కొత్తగా యాక్షన్‌ బటన్‌ను తీసుకువచ్చింది. దీన్ని ఎన్నో రకాల యాక్షన్‌కు ఉపయోగించుకోవచ్చు.

ఐఫోన్‌ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా

ఐఫోన్ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వగా.. లెన్స్ గ్లేర్ తగ్గించడానికి స్పెషల్‌ కోటింగ్‌ ఇచ్చింది. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరాలున్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో సైతం ఇదే సెటప్‌ కనిపిస్తుంది. టెలిఫొటో కెమెరా బదులు 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాను కంపెనీ అందించింది.

ఇది 5x ఆప్టికల్ జూమ్‌ను అందించనుండగా.. ఈ రెండు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఛార్జింగ్‌, కనెక్టివిటీ కోసం గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి కొత్తగా యూఎస్‌బీ టైప్-సీని తీసుకువచ్చింది.

ఇందులో యూఎస్‌బీ 3.0 స్పీడ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆప్షనల్ కేబుల్ ద్వారా 10 జీబీపీఎస్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో ఒక రోజు పూర్తిగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అంత కంటే కొంచెం ఎక్కువగా బ్యాటరీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

Updated On 13 Sep 2023 4:15 AM GMT
cm

cm

Next Story