Apple Live Event | చేతిలో ఐఫోన్ ఉంటే ఆ రేంజ్, క్రేజ్ మామూలుగా ఉండదు. ధర ఎక్కువైనా చాలా మంది ఫోన్లను కొనుగోలు చేసుందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్‌లోకి ఎన్ని రకాల కొత్త ఫోన్లు వచ్చినా ఐఫోన్ క్రేజ్ మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. పైగా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 14 సిరీస్‌ను ప్రకటించగా.. మరికొద్ది గంటల్లోనే ఐఫోన్ […]

Apple Live Event |
చేతిలో ఐఫోన్ ఉంటే ఆ రేంజ్, క్రేజ్ మామూలుగా ఉండదు. ధర ఎక్కువైనా చాలా మంది ఫోన్లను కొనుగోలు చేసుందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్‌లోకి ఎన్ని రకాల కొత్త ఫోన్లు వచ్చినా ఐఫోన్ క్రేజ్ మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. పైగా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 14 సిరీస్‌ను ప్రకటించగా.. మరికొద్ది గంటల్లోనే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనున్నది. దాంతో పాటు ఇతర గ్యాడ్జెట్‌ను సైతం కంపెనీ ప్రకటించబోతున్నది.
ఇందు కోసం లైవ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఈ యాపిల్ 'వండర్లస్ట్' 2023 ఈవెంట్‌ను కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌ను సిద్ధం చేసింది. కొవిడ్ కారణంగా కొనేళ్లుగా ఆన్‌లైన్ మోడల్ నిర్వహించగా.. ఈ సారి లైవ్ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ వెంట్ స్థానిక కాలమానం ప్రకారం కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. అంటే భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ షురూ కానున్నది. యాపిల్ ఆఫీషియల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
యాపిల్ ఏయే మోడల్స్‌ను రిలీల్ చేయనున్నదంటే..?
యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్‌లో లాంచ్ చేయబోయే మోడల్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను మార్కెట్‌లోకి తేబోతున్నదని సమాచారం.
వీటితో పాటు యాపిల్ వాచ్ 9 సిరీస్, యాపిల్ వాచ్-2 అల్ట్రా, యాపిల్ ఇయర్ ప్యాడ్ తదితర ఉత్పత్తులను రిలీజ్ చేయనున్నది మార్కెట్‌లో వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. సరఫరా గొలుసు వ్యవస్థలో ఇబ్బందులు ఇందుకు కారణమని సమాచారం.
అయితే, ఈ వార్త నిజమైనా లైవ్ ఈవెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపించదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు ఫోన్ 1199 నుంచి 1299 డాలర్ల మధ్యలో ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నది. గతంలో ప్రో మ్యాక్స్‌లో 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్‌గా ఉండగా.. ఇప్పుడు దాన్ని 256 జీబీకి పెంచిందని తెలుస్తున్నది.
ఇక అంతర్జాతీయ స్థాయిలో ఐఫోన్స్ విడుదలయ్యాక.. చాలా రోజులకు భారత్‌లోకి వచ్చేవి. అయితే, ఈ సారి అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నదని సమాచారం. ఇప్పటికే కంపెనీ ముంబయి, ఢిల్లీలో యాపిల్ స్టోర్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఐఫోన్ 15 సిరీస్‌పై బజ్..
యాపిల్ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో కొత్తగా లాంచ్ చేసే ఐఫోన్ సిరీస్‌తో పాటు దాని తర్వాత వచ్చే సిరీస్ సైతం సర్వతా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో లైవ్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్న నేపథ్యంలో.. కొత్త సిరీస్‌పైనా బజ్ నెలకొన్నది.
వండర్ లస్ట్ ఈవెంట్‌లో కంపెనీ ఏదైనా ప్రకటన చేస్తుందా ? అనే ఆసక్తి నెలకొన్నది. ఇక ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచ్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుందని టాక్. ప్రో మోడల్లో ఏ18 బయానిక్ చిప్సెట్ ఉంటుందని, ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చని సమాచారం.
