విధాత: మందుల వాడకం గత ఒకటి రెండు దశాబ్ధాలుగా చాలా పెరిగిపోయింది. ఏదో ఒక సమస్యకు ముందులు వేసుకోని వారు అసలు ఉండటం లేదంటే అబద్ధం కానే కాదు. వయసుతో నిమిత్తం లేకుండా మందుల వాడకం ప్రపంచ వ్యాప్తంగా చాలా పెరిగిపోయిందని అధ్యయనాలు రుజువులతో సహా నిర్థారిస్తున్నాయి. మనుషులు నొప్పి భరించడాన్ని పూర్తిగా మానేశారని చెప్పొచ్చు. చిన్న చిన్న గాయాల నుంచి పెద్ద పెద్ద సర్జరీల వరకు అన్నింటిలోను పెయిన్ కిల్లర్స్ వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి […]

విధాత: మందుల వాడకం గత ఒకటి రెండు దశాబ్ధాలుగా చాలా పెరిగిపోయింది. ఏదో ఒక సమస్యకు ముందులు వేసుకోని వారు అసలు ఉండటం లేదంటే అబద్ధం కానే కాదు. వయసుతో నిమిత్తం లేకుండా మందుల వాడకం ప్రపంచ వ్యాప్తంగా చాలా పెరిగిపోయిందని అధ్యయనాలు రుజువులతో సహా నిర్థారిస్తున్నాయి. మనుషులు నొప్పి భరించడాన్ని పూర్తిగా మానేశారని చెప్పొచ్చు.

చిన్న చిన్న గాయాల నుంచి పెద్ద పెద్ద సర్జరీల వరకు అన్నింటిలోను పెయిన్ కిల్లర్స్ వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది. పెయిన్ కిల్లర్స్ లేని ఇళ్లు దాదాపు ఉండడం లేదు. కనీసం పారాసిటామోల్ అయినా ఉంటోంది ప్రతి ఇంట్లో. పాండమిక్ మొదలైనప్పటి నుంచి పారాసిటామోల్ వినియోగం చాలా పెరిగిందని సర్వేలు నిర్ధాస్తున్నాయి. జ్వరానికి, నొప్పులకు పారాసిటమాల్ వాడుతున్నారు.

ఎక్కువైతే కష్టమే..

పిల్లల నుంచి వృద్ధుల వరకు పారసిటమాల్ వాడని వారే లేరంటే అతిశయోక్తి కాదు. అయితే మోతాదుకు మించితే మాత్రం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా సరే డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో పారసిమాల్ అసలు తీసుకోకూడదు.

పారాసిటామాల్‌ను తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, పిరియడ్ క్రాంప్స్ ఇలా రకరకాల సమస్యలకు ఒకే పరిష్కారం కింద వాడుతున్నారు. ఇది మాములుగా శరీరంలోని పెయిన్ రిసెప్టార్స్ ను బ్లాక్ చేస్తుంది. ఫలితంగా నొప్పి ఉండదు. 24 గంటల వ్యవధిలో అడల్ట్స్ 500 ఎంజీ టాబ్లెట్స్ ఎనిమిదికి మించి తీసుకోకూడదు.

రెండు టాబ్లెట్స్ మధ్య కనీసం 4గంటల సమయం ఉండాలి. దీని ప్రకారం 24 గంటల్లో ఒక అడల్ట్ పర్సన్ 500 ఎంజీ టాబ్లెట్లు నాలుగు తీసుకోగలుగుతారు. నిపుణుల సూచనల మేరకు పారసిటామాల్ ఎంత కాలం వాడినా పెద్దగా నష్టం ఉండదు. ఇది భోజనం తర్వాత లేదా భోజనం ముందు ఎలా తీసుకున్నా ఫర్వాలేదు.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే?

ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ వాడినపుడు చాలా సీరియస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉందని డబుల్ డోస్ తీసుకోవడం లేదా డోస్ పెంచుకోవడం చెయ్యకూడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పారాసిమాలే కదా అని డోస్ పెంచి తీసుకుంటూ ఉంటారు.

ఎక్కువ మోతాదులో వాడుతున్న మందుల్లో పారాసిటమాల్ ముందుంటుంది. అయితే ఇది అధిక మోతాదులో తీసుకున్నపుడు లివర ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది. లివర్ ఫేయిల్యూర్ అనేది అప్పుడప్పుడు మరణానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

Updated On 4 Nov 2022 12:28 PM GMT
krs

krs

Next Story