దాడికి యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తత నడుమ అరెస్టు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు Sejal | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వ్యతిరేకంగా అరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ చేస్తున్న ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలోని పలు దుకాణాల వద్ద ఆమె ప్రచారం చేసింది. దుర్గం చిన్నయ్యకు తప్ప ఎవరికైనా ఓటు వేయాలని కోరారు. చిన్నయ్య తనకు అన్యాయం చేశాడని, […]

  • దాడికి యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు
  • ఉద్రిక్తత నడుమ అరెస్టు
  • బీజేపీ, కాంగ్రెస్ మద్దతు

Sejal | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వ్యతిరేకంగా అరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ చేస్తున్న ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలోని పలు దుకాణాల వద్ద ఆమె ప్రచారం చేసింది. దుర్గం చిన్నయ్యకు తప్ప ఎవరికైనా ఓటు వేయాలని కోరారు. చిన్నయ్య తనకు అన్యాయం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయనకు ఓటు వేస్తే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. అతనికి తప్ప ఎవరికైనా ఓటేయాలని ప్రచారం చేశారు. శేజల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెంట ఉండి మద్దతిచ్చారు.

బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని, శేజల్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు సన్నీబాబు, అతని అనుచరులు శేజల్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆమె ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మద్దతుగా వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. ఇరుపార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు శేజల్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. శేజల్ మద్దతు ఇచ్చినందుకు విపక్ష పార్టీల నాయకుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వ

Updated On 1 Sep 2023 12:21 PM GMT
somu

somu

Next Story