Saturday, April 1, 2023
More
    HomelatestBJP దుర్మార్గాలకు పరాకాష్ట.. సిసోడియా అరెస్ట్: మంత్రి జగదీష్ రెడ్డి

    BJP దుర్మార్గాలకు పరాకాష్ట.. సిసోడియా అరెస్ట్: మంత్రి జగదీష్ రెడ్డి

    • ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయి

    విధాత: బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్టనే ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మీడియా తో మాట్లాడిన మంత్రి బీజేపీ పాలనలో ఈ.డీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయన్నారు. బీజేపీ నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్నారు.

    గత కొంతకాలంగా గమనిస్తే బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపైనే ఎక్కువగా సీబీఐ, ఈడీలు పనిచేస్తున్నాయని అర్దం అవుతుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు.

    బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికం అని మంత్రి అన్నారు. బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, అణచివేతల ద్వారా, జైళ్లను నింపడం ద్వారా ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతుందని అన్నారు. బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి అన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular