SPG Chief Arun Kumar | న్యూఢిల్లీ : ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ కుమార్.. గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్ది నెలల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కేరళ క్యాడర్ నుంచి 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన […]

SPG Chief Arun Kumar |
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ కుమార్.. గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గత కొద్ది నెలల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కేరళ క్యాడర్ నుంచి 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్.. 2016లో ఎస్పీజీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. కేరళ పోలీసు విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాయన.
తిరువనంతపురంలో డీసీపీ కమిషనర్, రేంజ్ ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, అడ్మినిస్ట్రేషన్ ఐజీగా సేవలందించారు. 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో ప్రధానులు, వారి కుటుంబాల భద్రత కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే 1985లో ఎస్పీజీ ఏర్పాటైంది. ప్రస్తుత, మాజీ ప్రధానులు, వారి సమీప కుటుంబ సభ్యుల భద్రతను ఎస్పీజీ బృందం పర్యవేక్షించేది. కానీ కొద్ది కాలం క్రితం మార్పులు చేశారు. దీంతో ప్రస్తుతం కేవలం పదవిలో ఉన్న ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత లభిస్తోంది.
