విధాత: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి సుప్రీం కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వ్యతిరేకంగా కేజ్రీవాల్ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్కు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలువనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే.