విధాత: తెలుగులో బిగ్ బాస్ షో 5 సీజన్లు బాగానే రన్ అయినప్పటికీ ఆరో సీజన్ మాత్రం చప్పగా సాగింది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ లేని టాస్కులు, ముందుగానే లీకైన ఎలిమినేషన్, ఏమాత్రం ఆకట్టుకొని కంటెస్టెంట్స్ తీరు, గొడవలు, రొమాన్స్ వర్కవుట్ కాకపోవడంతో.. 6వ సీజన్ అంతా సాదాసీదా నడవడంతో ఆ ఎఫెక్ట్ హోస్ట్ నాగార్జునపై పడింది. ఇక ఆయన ఈ షో నుంచి, వచ్చే సీజన్ నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అషురెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఆమె సీజన్ 3లో పాల్గొన్నారు. డబ్స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా అషురెడ్డి పాపులర్. ఆమెకి టిక్ టాక్‌లో పెద్ద మొత్తంలో ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె పెద్ద సెలబ్రిటీ. సోషల్ మీడియా స్టార్ హోదాలో ఆమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది కానీ ఈ హౌస్‌లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. స్కిన్ షో నే నమ్ముకున్న ఆమె జర్నీ ఎక్కువ కాలం సాగలేదు.
విశాఖపట్టణంకు చెందిన ఈమె పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని, లేడీ సూపర్‌స్టార్ సమంత పోలికలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈమె మనసు కూడా సమంతలానే దయాహృదయంతో ఉంటుందని అంటారు. ఈ షోలో కొద్ది వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఇక ఈమె నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో వచ్చిన చల్ మోహనరంగా సినిమాలో నటించింది. యాంకర్ ప్రదీప్‌తో ఈమె లిప్ లాక్ సంచలనం సృష్టించింది. కమెడియన్ హరితో చాలా కామెడీ స్కిట్స్ చేసింది.
RGV – Ashu Reddy | అషురెడ్డి పాదాలను ముద్దాడిన ఆర్జీవీ.. వీడియో వైరల్..!
బిగ్ బాస్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్‌తో కూడా ఈమెకి ఎఫైర్ ఉందని నాడు వార్తలు హల్చల్ చేశాయి. స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో సైతం ఈమె స్కిట్స్ చేసింది. ఈ మధ్య ఈమె బుల్లితెరపై కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రమ్‌లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఆమె స్కిన్ షో చేస్తుండగా నెటిజన్స్ ఆమెను గురించి నెగటివ్‌గా కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక రామ్ గోపాల్ వర్మతో రెండు సార్లు ఇంటర్వ్యూలో పాల్గొంది. సెక్స్ గురించి ఇతర శృంగార విషయాల గురించి అడగడంతో ఈ ఇంటర్వ్యూలతో ఆమెకు విపరీతమైన పాపులారిటీతో పాటు నెగెటివిటీ పెరిగిపోయింది. ఛీ… డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తావా అని తిట్టుకుంటున్నారు. దాంతో ఆమెకి చాలా బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. అయితే తాజాగా ఆమెలో తెలియని కోణం బయటికి వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా తాను ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తున్న అనాధలను ఆమె కలిసింది. వారిలో ఇద్దరు స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డిగ్రీ కూడా పూర్తి చేశారు.
View this post on Instagram
తన ఆర్థిక సాయంతో ఉన్నత చదువు చదివిన అనాధల గురించి అషురెడ్డి చాలా గర్వంగా ఫీల్ అవుతోంది. అనాధలకు సహాయం చేయడం గొప్ప విషయంగా భావిస్తోంది. ఈ పోస్ట్ చూశాక ఎవరికైనా సదరు అనాధ పిల్లలకు సహాయం చేయాలని ఉంటే ఇవిగో వివరాలంటూ డీటెయిల్స్ పంచుకున్నారు. పైకి పచ్చిగా కనిపించే అషురెడ్డిలో ఇంత దయాగుణం ఉందా? ఆమె అనాధ పిల్లలను చదివిస్తున్నారా? అని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది.
మొన్నటిదాకా అషురెడ్డిని తిట్టిన వారే ఇప్పుడు ఆమెను పొగిడేస్తున్నారు. ఎంతైనా తెరపై కనిపించే వారందరూ నిజజీవితంలో కూడా అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు. వారు ఏదో బతుకు తెరువు కోసం స్కిన్ షోలు, ఇతర కాంట్రవర్సీ జోలికి వెళ్తారు గాని నిజజీవితంలో వారు చాలా మంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. కోట్లకుకోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని జనాల వైపు అసలు చూడని బిజినెస్ మైండ్ కలిగిన సినీనటీనటుల కంటే వీరే గొప్పవారని ఘంటాపథంగా చెప్పవచ్చు.
అషు రెడ్డి అడల్ట్.. పూర్తి అంగీకారంతో ఇద్దరం ఆ.. పని చేశాం: వర్మ