IND vs PAK | పాకిస్తాన్- ఇండియా మధ్య మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు. ఐసీసీ టోర్నమెంట్స్‌లోనే ఈ రెండు జట్లు తలపడుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఆసియా కప్‌లో పాకిస్తాన్- ఇండియా జట్లు తలపడగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4)లతో పాటు నాలుగో స్థానంలో బరిలోకి దిగి జట్టును ఆదుకుంటాడు అని […]

IND vs PAK |
పాకిస్తాన్- ఇండియా మధ్య మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు. ఐసీసీ టోర్నమెంట్స్‌లోనే ఈ రెండు జట్లు తలపడుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఆసియా కప్‌లో పాకిస్తాన్- ఇండియా జట్లు తలపడగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు.
ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4)లతో పాటు నాలుగో స్థానంలో బరిలోకి దిగి జట్టును ఆదుకుంటాడు అని భావించిన శ్రేయస్ అయ్యర్ (14) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 66 పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చాలా కష్టాలలో పడింది.
అలాంటి సమయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు.
చివర్లో జస్ప్రిత్ బుమ్రా కూడా విలువైన 16 పరుగులు చేయడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అయితే మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లోను అదే ఫాం కొనసాగించారు. ఇక హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
ఈ ఇద్దరు కూడా సెంచరీలు చేస్తారని అనుకోగా, 80లలో ఔట్ కావడం గమనర్హం. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్‌ను హారిస్ రవూఫ్ ఔట్ చేసి 138 పరుగుల భాగస్వామ్యానికి చెక్ పెట్టాడు. ఇక జడేజా (14) తో కలిసి హర్దిక్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపే ప్రయత్నం చేయగా, అయితే షాహిన్ అఫ్రిది ఒకే ఓవర్ లో హర్దిక్‌తో పాటు జడేజాలను ఔట్ చేసి పెద్ద దెబ్బే కొట్టాడు.
శార్దూల్ ఠాకూర్(3) కూడా నిరాశపరిచాడు. 50 ఓవర్లు ఆడకుండానే భారత్ 266 పరుగులకి ఔట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్‌కి ముందు జోరుగా వర్షం కురిసింది. వర్షం కాసేపు తగ్గినా తిరిగి ప్రారంభించాలని అనుకునేలోపు మళ్లీ వర్షం అందుకుంది.
మ్యాచ్ నిర్వహించేందుకు 9 గంటల 54 నిమిషాల వరకూ ఎదురుచూసిన వరుణుడు ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ ఇరు జట్లకి చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటికే నేపాల్‌పై గెలిచి భారీ విజయం దక్కించుకున్న పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించింది.
ఇక టీమిండియా, సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయినా కూడా టీమిండియా సూపర్ 4 స్టేజీకి చేరుకోవడం ఖాయం.
