Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ చాలా హోరాహోరీగా సాగుతుందని అందరు అనుకున్నారు. కాని మ్యాచ్ మాత్రం ఏకపాక్షంగా సాగుతుందని చెప్పాలి ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. వికెట్ల కూల్చడం బుమ్రా మొదలెడితే, మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌తో లంక బ్యాటర్లను వణికించాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా తనవంతు వికెట్స్ తీయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. ఫైనల్ మ్యాచ్‌లో జస్ప్రిత్ […]

Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ చాలా హోరాహోరీగా సాగుతుందని అందరు అనుకున్నారు. కాని మ్యాచ్ మాత్రం ఏకపాక్షంగా సాగుతుందని చెప్పాలి ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. వికెట్ల కూల్చడం బుమ్రా మొదలెడితే, మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌తో లంక బ్యాటర్లను వణికించాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా తనవంతు వికెట్స్ తీయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
ఫైనల్ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా మొదటి ఓవర్ మూడో బంతికే తొలి వికెట్ తీసి శ్రీలంకని ఇబ్బందుల్లో పెట్టాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ పదునైన బంతులో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంకచాలా కష్టాలు పడింది. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్స్ వికెట్లని ఆపుకునే ప్రయత్నం చేసిన సిరాజ్ పదునైన బంతులతో పాటు పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో ఇండియా 50 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు శుభారంభం ఏ మాత్రం దక్కలేదు. 2 బంతులు ఆడిన కుసాల్ పెరేరా, బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా, ఆ తర్వాత . 4 బంతుల్లో 2 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి ఔటయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే సధీర సమరవిక్రమ కూడా డకౌట్ అయ్యాడు..
ఇక సమరవిక్రమ అవుటైన తర్వాతి బంతికే చరిత్ అసలంక కూడా ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక సిరాజ్ కి హ్యాట్రిక్ దక్కుతుందని అందరు భావించగా, ధనంజయ డిసిల్వ మాత్రం బౌండరీ బాది అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాతి బాల్‌కి సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకని పెవిలియన్ చేరడంతో శ్రీలంక పీకల్లోతు కష్టాలలో పడింది. 34 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కుసాల్ మెండిస్‌ని మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేయగా, 21 బంతుల్లో 8 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగేని హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు. 1 పరుగు చేసిన ప్రమోద్ మదుషాన్, పథిరాణాలను హార్ధిక్ పాండ్యా వెంటవెంటనే ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 50 పరుగులకి ముగిసింది. భారత్ ఆసియా కప్ గెలవాలంటే భారత్ 50 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి ఉంది.
