విధాత: మేడ్చ‌ల్ జిల్లాలోని ఓ అనాథ ఆశ్ర‌మంలో బాలిక‌పై లైంగిక‌దాడి ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ నెల 19న న‌లుగురు బాలిక‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని అనాథ ఆశ్ర‌మ నిర్వాహ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌రు బాలిక‌ల‌ను సికింద్ర‌బాద్‌లో గుర్తించారు. మ‌రో ఇద్ద‌రు బంధువుల ఇళ్ల‌లో ఉన్న‌ట్లు నిర్ధారించుకున్నారు. స‌ఖీ సెంట‌ర్‌కు త‌ర‌లించి బాలిక‌ల‌కు కౌన్సిలింగ్ ఇవ్వ‌గా అందులో ఒక అమ్మాయి త‌న‌పై లైంగిక […]

విధాత: మేడ్చ‌ల్ జిల్లాలోని ఓ అనాథ ఆశ్ర‌మంలో బాలిక‌పై లైంగిక‌దాడి ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ నెల 19న న‌లుగురు బాలిక‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని అనాథ ఆశ్ర‌మ నిర్వాహ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌రు బాలిక‌ల‌ను సికింద్ర‌బాద్‌లో గుర్తించారు. మ‌రో ఇద్ద‌రు బంధువుల ఇళ్ల‌లో ఉన్న‌ట్లు నిర్ధారించుకున్నారు. స‌ఖీ సెంట‌ర్‌కు త‌ర‌లించి బాలిక‌ల‌కు కౌన్సిలింగ్ ఇవ్వ‌గా అందులో ఒక అమ్మాయి త‌న‌పై లైంగిక దాడి జ‌రిగింద‌ని చెప్పింది.

అనాథ ఆశ్ర‌మంలో అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్న ముర‌ళి త‌న‌ను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, అందుకే పారిపోయిన‌ట్లు తెలిపిన‌ట్లు స‌మాచారం. మైన‌ర్ బాలిక ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనాథ ఆశ్ర‌మ నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనపై నేరేడ్‌మెట్ సీఐ మాట్లాడుతూ.. అమ్మాయిలను సీడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేశామని, కౌన్సిలింగ్ సమయంలో ఓ అమ్మాయి స్టేట్‌మెంట్ ఇచ్చిందన్నారు. ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా బలమైన సాక్ష్యాలు దొరకడంతో అకౌంటెంట్ మురళిపై కేసు నమోదు చేశామని చెప్పారు. చిల్డ్రన్ హోంలో మిగితావారిని ప్రశ్నించి స్టేట్‌మెంట్ తీసుకుంటామని నేరేడ్‌మెట్ సీఐ తెలిపారు.

గ్రేస్ చిల్డ్రన్ హోం ఇన్‌చార్జ్ విక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19న నలుగురు అమ్మాయిలు పారిపోయారని, ఆ నలుగురిని పోలీసుల సాయంతో సఖీ సెంటర్‌కు పంపించామన్నారు. వారిలో ఇద్దరు గతంలో పారిపోయినవారేనని, అకౌంటెంట్ మురళి ఫిబ్రవరిలో తమను బయటకు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారన్నారు. అయితే ఈ విషయాన్ని అప్పుడు వారు మా దృష్టికి తీసుకురాలేదన్నారు. ఇప్పుడెందుకు మురళిపై అభియోగాలు చేస్తున్నారో తెలియదన్నారు.

Updated On 26 Oct 2022 10:50 AM GMT
krs

krs

Next Story