Avinash Reddy విధాత‌: వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తుందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఆయనకు చిన్న రిలీఫ్ దక్కింది. ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఎంపిని బుధవారం వరకూ అరెస్ట్ చేయవద్దని సీబీఐని తెలంగాణ హై కోర్టు సూచించింది. అవినాష్ ముంద‌స్తు బెయిల్ పై బుధ‌వారం తీర్పు వెల్ల‌డిస్తామ‌నీ, అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేయెద్ద‌ని సీబీఐని ఆదేశించింది. ఈ […]

Avinash Reddy

విధాత‌: వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తుందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఆయనకు చిన్న రిలీఫ్ దక్కింది. ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఎంపిని బుధవారం వరకూ అరెస్ట్ చేయవద్దని సీబీఐని తెలంగాణ హై కోర్టు సూచించింది.

అవినాష్ ముంద‌స్తు బెయిల్ పై బుధ‌వారం తీర్పు వెల్ల‌డిస్తామ‌నీ, అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేయెద్ద‌ని సీబీఐని ఆదేశించింది. ఈ విషయమై శుక్రవారం అవినాష్, సునీత తరపు లాయ‌ర్ల వాద‌న‌లు విన్న హైకోర్టు.. శనివారం సీబీఐ త‌రుపున వాద‌న‌లు రికార్డ్ చేసింది.

అవినాష్ త‌ల్లి అనారోగ్యం దృష్ట్యా ఆయ‌న్ను బుధ‌వారం వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కుండా సీబీఐని అదేశించాల‌ని ఎంపి త‌ర‌ఫు లాయ‌ర్ కోర‌గా అందుకు కోర్టు అంగీక‌రించింది. ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలు సీబీఐ మీద సంధించింది.

కాగా వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముందని.. అవినాష్‌ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్‌మెంట్లు ఉన్నాయి కదా? అని కోర్టు సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఉద‌య్‌కుమార్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ల నుంచి ఏమైనా స‌మాచారం రాబ‌ట్టారా? కూడా ప్రశ్నించింది. అయితే వాళ్లు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని సీబీఐ సమాధానం ఇచ్చింది

అవినాష్‌రెడ్డి కూడా విచార‌ణ‌కు స‌హ‌కరించ‌డం లేద‌ని.. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఏదో ఒక‌సాకుతో త‌ప్పించుకుంటున్న‌ట్టు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అవినాష్‌రెడ్డి కోరిన‌ట్టు ద‌ర్యాప్తు చేయ‌డం త‌మ ప‌నికాద‌ని సీబీఐ వివరించింది. మరో వైపు వివేకా హత్య విషయం జగన్ కు ముందే తెలుసు అన్నట్లుగా సీబీఐ పేర్కొన్న పత్రాల్లో వెల్లడించడంతో కేసు మరింత జటిలం అయింది.

Updated On 27 May 2023 3:10 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story