SKN | సినిమా రిలీజ్ అవగానే ఫస్టాఫ్ ఇలా ఉంది, సెకండాఫ్ అలా ఉందని అంచనాలు వేసేసి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు జనం. కానీ ఇది ఆ సినిమా విజయం పై ఎంత ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ ఆలోచించరు. ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక్క హీరోనే కాదు.. సినిమాకు పనిచేసిన అందరి మీదా దాని ప్రభావం ఉంటుంది. నిర్మాతకు తగిలిన గాయం అంతటితోనే పోదు.. […]

SKN |
సినిమా రిలీజ్ అవగానే ఫస్టాఫ్ ఇలా ఉంది, సెకండాఫ్ అలా ఉందని అంచనాలు వేసేసి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు జనం. కానీ ఇది ఆ సినిమా విజయం పై ఎంత ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ ఆలోచించరు. ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక్క హీరోనే కాదు.. సినిమాకు పనిచేసిన అందరి మీదా దాని ప్రభావం ఉంటుంది.
నిర్మాతకు తగిలిన గాయం అంతటితోనే పోదు.. ఆ సినిమాకు పనిచేసిన అన్ని క్రాప్ట్స్‌లో పనిచేస్తున్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇదేమీ ఆలోచించని జనం ఒక్క మాటతోనో, పోస్ట్ తోనో సినిమాని తీసి పారేస్తూ ఉంటారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయ్యి, బిగ్ డిజాస్టర్‌గా నిలిచిన మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీకి కూడా ఇలాంటి సెగే కారణమని అభిప్రాయపడ్డారు ‘బేబీ’ నిర్మాత SKN. విషయంలోకి వెళితే..
ఈమధ్య రిలీజ్ అయిన ‘భోళా శంకర్’ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా యాభై కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఇక చిరంజీవి సినిమా రిలీజ్ అంటే టిక్కట్ల కోసం పడిగాపులు పడి, ఆత్రంగా చిరూ స్టెప్పులు, డైలాగ్స్ కోసం ఎగబడే ఫ్యాన్స్.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త పెద్దగానే విమర్శలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా చేసుకుని చిరుకి సలహాలను ఇచ్చారు. సినిమా మీద నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఈ విషయంగానే SKN మాట్లాడుతూ.. నలభై దాటాయంటే అడుగులు తడబడుతూ నడుస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. అలాంటిది మెగాస్టార్ 70కి దగ్గరవుతున్నా కూడా ఇంకా అదే గ్రేస్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన స్టైల్ ఆయన రేంజ్ ఎవరూ బీట్ చేయలేనిది.
బాస్ ఫ్యాన్స్‌కి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. చిరంజీవి పని ఇక్కడితో అయిపోయిందని ఎప్పుడు విమర్శలు వచ్చినా.. తిరిగి మళ్లీ మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నాడు. అలాంటిది ఆయనకే సలహాలు ఇస్తున్నారు. ఆయనకు తెలుసు స్ట్రయిట్ సినిమాలు చేయాలా లేక రీమేక్స్ చేయాలా అనేది.
ఫ్యాన్స్‌గా మనలోనే ఐకమత్యం లేకపోతే ఎలా.. ‘హిట్లర్’ తర్వాత పనైపోయిందన్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ వరకూ వెనక్కు తిరిగి చూడకుండా హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడూ ‘భోళా శంకర్’ పోతేనేం.. మళ్లీ హిట్ కొడతాం.. ఈసారి మాములుగా ఉండదు అంటూ నిర్మాత SKN ఎమోషనల్ అయ్యాడు.
మెగాస్టార చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. రీసెంట్‌గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రెండు చిత్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక సినిమాకు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకుడు కాగా, రెండో చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల అని అనుకుంటున్నారు.
