విధాత: హ‌ర్యానాలో అద‌మ్‌పూర్‌, పంచాయ‌తీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ డేరా బాబా గుర్మిత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు 40 రోజుల పెరోల్ ఇవ్వ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నవంబ‌ర్ 3న అద‌మ్‌పూర్‌ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. సిర్సాలోని త‌న ఆశ్ర‌మంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డినందుకు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. డేరా బాబా ఆశ్ర‌మం హ‌త్య‌, జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసులో ఆయ‌న‌ను కోర్టు దోషిగా తేల్చింది. గ‌త వారం గుర్మిత్ రామ్ […]

విధాత: హ‌ర్యానాలో అద‌మ్‌పూర్‌, పంచాయ‌తీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ డేరా బాబా గుర్మిత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు 40 రోజుల పెరోల్ ఇవ్వ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నవంబ‌ర్ 3న అద‌మ్‌పూర్‌ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. సిర్సాలోని త‌న ఆశ్ర‌మంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డినందుకు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది.

డేరా బాబా ఆశ్ర‌మం హ‌త్య‌, జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసులో ఆయ‌న‌ను కోర్టు దోషిగా తేల్చింది. గ‌త వారం గుర్మిత్ రామ్ ర‌హీమ్ సింగ్ కు 40 రోజుల పెరోల్ ఇవ్వ‌డంతో త‌న పాత్ర లేద‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్ తెలిపారు. జైళ్ల నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పెరోల్ వ‌చ్చి ఉంటుంద‌ని తెలిపారు.

కొన్నిరోజులుగా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బ‌ర్ణావ‌ ఆశ్ర‌మం నుంచి డేరా బాబా ఆన్‌లైన్ ఉప‌న్యాసాలు ఇస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న అనుచ‌రుల‌తో పాటు హ‌ర్యానాకు చెందిన కొంద‌రు బీజేపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న‌కు 3వారాలు పెరోల్ ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది

Updated On 27 Oct 2022 9:24 AM GMT
Somu

Somu

Next Story