Byronpally | విధాత: శ్రీనారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రాన్ని ఈనెల తొమ్మిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నరేష్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రం రెండో ట్రైలర్‌ను ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు శనివారం నాడు హైదరాబాదులో రిలీజ్ చేశారు. ఈచిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని దర్శకుడు వెంకట్ కాచర్ల తెలిపారు. […]

Byronpally |

విధాత: శ్రీనారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రాన్ని ఈనెల తొమ్మిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నరేష్ వర్మ తెలిపారు.

ఈ సందర్భంగా చిత్రం రెండో ట్రైలర్‌ను ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు శనివారం నాడు హైదరాబాదులో రిలీజ్ చేశారు. ఈచిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని దర్శకుడు వెంకట్ కాచర్ల తెలిపారు.

ఈ చిత్రంలో విజయ్ కుమార్ , ప్రభావతి , కృష్ణ మంజూష , ప్రేమ్ సాగర్ , ప్రసాద్ పొద్దుటూరి ,సురేందర్ రాజు , మాధవి ప్రసాద్, బలగం సుధాకర్ రెడ్డి , బలగం సుజాత, సురేష్ గడ్డం , లోరా మాడిసన్ , సత్య ప్రకాష్ , స్నేహ శర్మ, డాలియా, సాయి రాజ్ , ప్రిన్స్ వెంకీ , సందీప్ సక్సేనా , రాజేష్ దామెర , శ్రీనివాస్ ఆసంపల్లి , రమేష్ చిన్న తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా :డి వై గిరి , ఎడిటింగ్ : మహేంద్ర నాథ్ , బ్యాగ్రౌండ్ స్కోర్ :సందీప్ కుమార్ కనుగుల, మ్యూజిక్ : పూర్ణచంద్ర బైరి , డిటిఎస్ మిక్సింగ్: రమేష్ కామరాజు (రామానాయుడు స్టూడియోస్), నిర్మాత: నరేష్ వర్మ , స్క్రిప్ట్ , దర్శకత్వం: వెంకట్ కాచర్ల.

ఈ కార్యక్రమంలో నిర్మాత నరేష్ వర్మ , దర్శకుడు వెంకట్ కాచర్ల, సీనియర్ జర్నలిస్టు ,దర్శకులు అయిలు రమేష్ , సంగీత దర్శకులు పూర్ణచంద్ర బైరి నటి కృష్ణ మంజూష, నటుడు రమేష్ చిన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ మన తెలంగాణ కళాకారులతో మన తెలంగాణ ప్రాంతంలో నిర్మితమైన బైరాన్ పల్లి చిత్రం ఈనెల తొమ్మిదో తేదీన తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి సక్సెస్ చేయాలని కోరారు.

Updated On 3 Jun 2023 4:09 PM GMT
krs

krs

Next Story