Saturday, January 28, 2023
More
  Homelatestఅక్కినేనా.. తొక్కినేనా: ఆగని బాల‌య్య నోటిదురుసు.. విరుచుకు పడుతున్న పబ్లిక్‌

  అక్కినేనా.. తొక్కినేనా: ఆగని బాల‌య్య నోటిదురుసు.. విరుచుకు పడుతున్న పబ్లిక్‌

  విధాత‌: నోటికొచ్చినట్లు మాట్లాడడం.. తరువాత నాలుక కరుచుకోవడం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అలవాటుగా మారినట్లుంది.. ఎవరి గురించి మాట్లాడుతున్నదీ.. ఏమి మాట్లాడుతున్నదీ పూర్తిగా సోయి మరచి మాట్లాడే బాలయ్య బాబు ఇంకెప్పుడు నాగరికత నేర్చుకుంటారో తెలీదు. దానికి తోడు ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన్ను మించిన అరాచకం.. జై బాలయ్య అంటూ ఎగబడుతుంటారు.

  పది నిమిషాల్లో మూసేసే ఏ పబ్బులో అయినా జై బాలయ్య అంటూ వినిపిస్తుందని ఆయనే చెప్పుకున్నారు. అంటే ఫుల్లుగా తాగేసి ఉండేవాళ్ళ మాట్లాడే భాష ఏమిటో ఆయన చెబుతున్నారు. పనిలో పనిగా బాలయ్య బాబు కూడా అలాగే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మధ్య బ్రాహ్మణులను నోటికొచ్చినట్లు మాట్లాడి ఆ తరువాత నాలుక కరుచుకుని సారీ చెప్పిన బాలయ్య… పవన్ కళ్యాణ్ ఇంకా మెగా బ్రదర్స్ వారి ఫ్యాన్స్ ను అయితే ఏకంగా అలగా జనం అనేశారు.

  పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ను, ఓటర్లను అలగాజనం అనేసరికి అది కాస్తా అగ్గి రాజుకుంది. ఆ తరువాత అదే పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు నిర్వహించే ఆన్ స్టాపబుల్ కార్యక్రమానికి వెళ్లి ముచ్చటించారు..

  ఇక ఇప్పుడు బాలయ్య టంగ్ పవర్ అక్కినేని కుటుంబం మీద చూపించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీయార్ ఏఎన్నార్ ఇద్దరూ రెండు కళ్ళలాంటి వారు అంటారు. ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు.. అలాంటిది అక్కినేని కుటుంబాన్ని బాలకృష్ణ ఏకంగా అక్కినేని తొక్కినేని అంటూ హేళనగా కామెంట్ చేయడం చూస్తుంటే ఆయనలోని అహంభావం.. ఇతరుల పట్ల తనకున్న చులకన భావాన్ని తేటతెల్లం చేస్తోంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular