Balakrishna | కడిగిన ముత్యంలా బయటకొస్తారు పార్టీ కోసం నేనోస్తున్నా.. ముందుండి పోరాడుతా విధాత: రాజకీయ కక్ష సాధింపు కే సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు నమోదు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతుందని సినీ నటుడు, టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతిపై […]

Balakrishna |

  • కడిగిన ముత్యంలా బయటకొస్తారు
  • పార్టీ కోసం నేనోస్తున్నా.. ముందుండి పోరాడుతా

విధాత: రాజకీయ కక్ష సాధింపు కే సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు నమోదు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతుందని సినీ నటుడు, టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతిపై ఎలాంటి ఆధారాలు లేకుండా బాబును జైల్లో పెట్టాలన్న కుట్రతో ఈ స్కామ్‌ను సృష్టించారన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకుపాల్పడుతుందన్నారు. ఇలాంటివి టీడీపీ ఎన్నో చూసిందని, భయపడేది లేదని, పార్టీ కోసం నేను వస్తున్నానని, ముందుండి పోరాడుతానన్నారు. తెలుగు వాడి సత్తా, పౌరుషం చూపిద్దామన్నారు. చట్టాలు అతిక్రమించి కేసులు పెడితే చూస్తు ఊరుకునేది లేదని, ప్రజలు తిరుగబడాలన్నారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.

జగన్ ప్రభుత్వం చంద్రబాబుపైన మరిన్ని కేసులు పెట్టేందుకు కుట్ర చేస్తుందని, ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని, ప్రజల పక్షాన టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మాట ఇస్తే తప్పని పార్టీ టీడీపీ పార్టీ చరిత్ర అన్నారు. అధికారం అనేది ప్రజా సేవ చేయడానికే తప్ప రాజకీయ ప్రత్యర్థులను వేధించ డానికి కాదన్నారు. తాను 16 నెలలు జైలుకు వెళ్లోచ్చినందునా అందరూ జైలుకెళ్లాలన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందన్నారు.

చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను వారి ఇళ్లకు వెలుతానన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి ఫ్రతిపక్షాలపై కక్ష సాధింపు లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని, రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం మోపుతున్నారన్నారు. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారన్నారు. మొరిగితే పట్టించుకోనని, అతిక్రమిస్తే ఉపేక్షించనని, ప్రజలు జగన్ పాలనలో అనుభవించి కష్టాలు చాలని, మార్పు కోసం సైనికుల్లా ఉద్యమించాలన్నారు.

పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో పథకాలు అమలు చేశారని, వేల మందికి ఉపాధి కల్పించిన సంగతి మరువరాదన్నారు. హిందూపురంలోనే 1200మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాలుంటే చూపాలని, చార్జిషీట్ ఎందుకు వేయలేదని బాలకృష్ణ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారని, సీఎం కేవలం పాలసీ లమేరకర్ మాత్రమేనని, అధికారులు అమలు చేస్తారని, ఆజయ్ కల్లం ప్రతిపాదిస్తే ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని, అలాంటప్పుడు ప్రేమ్‌చంద్రారెడ్డి పేరు కేసులో ఎందుకు లేదన్నారు.

ప్రభుత్వం 370కోట్ల ఖర్చుతో 2లక్షల 13వేల మందికి శిక్షణ ఇచ్చిందని, డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ కూడా ఇచ్చిందన్నారు. జగన్ తన ప్రభుత్వ పాలనలో ఒక్కరికైనా కొత్త ఉద్యోగం ఇచ్చారా అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబుఒక బ్రాండ్ అని, అక్రమ కేసులపై న్యాయ, ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వ సంస్థలను విధ్వంసం చేసి యువతను గంజాయికి బానిసలు చేశారన్నారు. ప్రజల కోసం టీడీపీ పనిచేస్తుందని, దేనికి భయపడే పరిస్థితి లేదన్నారు.

Updated On 12 Sep 2023 10:19 AM GMT
somu

somu

Next Story