విధాత: బాలకృష్ణకి హిందూ సంప్రదాయాలు, గ్రంథాలు, పురాణాలు మొదలైన వాటిలో చాలా అనుభవం ఉందని ఆయనకు ఆయన భావిస్తూ ఉంటారు. అన్ని విషయాలు తనకే తెలుసునని అంటూ ఉంటారు. తెలుగుతో పాటు పలు భాషలు తనకు వచ్చు అంటారు. ఇక ఆమధ్య ఈయన తన హిందీ భాషతో ఆ భాషాభిమానులు బాధపడేలా మాట్లాడాడు.
తన తండ్రి తర్వాత పౌరాణిక చిత్రాలు చేయాలన్నా, ఆయా పాత్రలను డిజైన్ చేయాలన్నా మనకు మాత్రమే సాధ్యం అనుకుంటూ ఉంటారు. ఇలా తెలియని ఓ పొగరు బాలకృష్ణలో ఎప్పటి నుంచో జీర్ణించు కొని పోయింది. ఎందులో అయినా మేము మా వంశమే గొప్ప అంటారు.
ఎదుటి వారి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గుర్తించడు. ఈయన తన తండ్రిని, తనను దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉంటారు. డెమీగాడ్స్గా ప్రేక్షకుల చేత పిలిపించుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. అందుకు తగ్గట్లే యథా రాజా తథా ప్రజ టైపులో ఈయన అభిమానులది కూడా అదే తీరు. అభిమానులను కొట్టి.. దానికి సమాధానంగా నేను కొడితే నా అభిమానులు సంతోషిస్తారు. నా చేయి వారిని తాకిందని సంతోష పడతారు అంటూ ఉంటాడు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ వారికి తెల్లని బియ్యం తినడాన్ని అలవాటు చేసింది తన తండ్రేనని లేకపోతే వారు ఇంకా నాటి తరంలోనే జీవించేవారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మరోసారి అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. అని బాలయ్య ఓపెన్ గా మాట్లాడాడు. దీనిపై పలు విమర్శలు వచ్చినా బయటి మహిళా సంఘాలు, సినీ పెద్దలు ఎవ్వరూ ఆయన మాటలను తప్పు పట్టలేక భయ పడ్డారు.
చలపతిరావు బాబాయ్ వంటి పెద్దమనిషి ఏదో తమాషాకి సందర్భోచితంగా వాడిన వాక్యాలను మహిళా లోకం తీవ్రంగా ఖండించింది. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటై చలపతిరావును దుమ్మెత్తి పోశారు. కానీ బాలయ్యను అలా దుమ్మెత్తి పోసే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. అటువంటి బాలయ్య అనూహ్యంగా ఓ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాడు.
అంతేకాదు చాలా తగ్గి మరి ఆయన ఆ కులం వారికి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణాసురుడు అని బాలయ్య అన్నారు. దీన్ని ఆ సామాజిక వర్గం తప్పు పట్టింది. దేవ బ్రాహ్మణుల చరిత్ర తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నాది తప్పైపోయింది అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. కావాలని చేసిన పని కాదు అంటూ సుదీర్ఘ పశ్చాతాప సందేశాన్ని ఆయన విడుదల చేశాడు కారణ జన్ముడైన బాలయ్య ఇలా ఓ బీసీ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పడం కొత్తగా ఉంది. ఓటు బ్యాంకు సమీకరణాలలో భాగంగానే బావ చంద్రబాబు ఆదేశం మేరకు బాలయ్య తగ్గాడనే వాదనలు వినిపిస్తున్నాయి.