విధాత: ఇండియన్ ఫిలిం హిస్టరీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ.. సినిమాల్లో కూడా టాప్ స్టార్‌గా కొనసాగుతున్న హీరో అంటే పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడు. కమలహాసన్ కూడా గుర్తుకు వచ్చినప్పటికీ ప్రస్తుతం పవన్‌కు ఉన్న టాప్ స్టార్ ఇమేజ్ ఆయనకు లేదనే చెప్పుకోవాలి.
అది పవన్ కళ్యాణ్‌కి మాత్రమే సొంతం. రాజకీయాలలోకి వచ్చిన సినిమా వాళ్లు తర్వాత స్టార్ స్టేటస్‌ని పోగొట్టుకున్నారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇసుమంత క్రేజ్ కూడా తగ్గకపోగా.. ఒకప్పుడు ఉన్న క్రేజ్ పెరిగి దాని కంటే మూడింతలు క్రేజ్‌ను చూస్తున్న హీరో మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే.
ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు నిర్మాతలు. ఏదైనా షోకి ఇంటర్వ్యూస్ ఇచ్చాడంటే కనీవినీ ఎరుగని రేంజ్‌లో టీఆర్పీలు వస్తాయి. రీసెంట్‌గానే పవన్ ఆహా మీడియాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్నాడు.
చాలామంది స్టార్స్ ఈ షోలో పాల్గొన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌కు లభించిన రెస్పాన్స్ మిగతా వారికి రాలేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ షో చూసి మెంటల్ ఎక్కిపోయినా ఆహా మీడియా టీం.. ఇప్పుడాయనతో ఒక షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందనేలా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
హిందీలో అమిర్ ఖాన్ హోస్ట్‌గా సత్యమేవ జయతే ప్రోగ్రాం సెన్సేషనల్ హిట్టయింది. జనాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే వేదికగా మారింది. తెలుగులో ఇదే షోని పవన్ కళ్యాణ్‌తో చేయించాలనే ఆలోచన ఆహా యూనిట్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన బిజీ వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
అయితే మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ ఓ అడుగు ముందుకేసి.. పవన్ కళ్యాణ్‌తో ఈ షో ని ఓకే చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్. రీసెంట్‌గానే పవన్‌ని కలిసి.. ఈ ఐడియా చెప్పగా, ఆయనకు ఎంతగానో నచ్చి వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడనేలా కూడా వార్తలు వినవస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి వార్తలు బయటికి రాలేదు. మరి ఈ షో కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ఎప్పటికి రివీల్ అవుతాయో చూడాలి.