Tuesday, January 31, 2023
More
    Homelatestవీర సింహారెడ్డి: జ‌గ‌న్‌ని టార్గెట్ చేసిన బాలయ్య..!

    వీర సింహారెడ్డి: జ‌గ‌న్‌ని టార్గెట్ చేసిన బాలయ్య..!

    విధాత‌: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి తాజాగా విడుదల అయింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఎలివేషన్స్ మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్ మీద పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. తనకు వచ్చిన మంచి అవకాశాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని సద్వినియోగం చేసుకోలేక పోయాడని చాలా మంది భావిస్తున్నారు.

    ఎంతసేపటికి హీరో ఎలివేషన్స్ పై ఆధారపడి సమయం, సందర్భం లేకుండా ఏపీలోని ప్రస్తుత వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా ఈ చిత్రం ఉందని అంటున్నారు. కథలో భాగంగా వైసిపిని, జగన్ ను టార్గెట్ చేస్తే బాగుండేదని కానీ సందర్భోచితం కాకుండా ఇలా టార్గెట్ చేస్తే అది సినిమాకు మైనస్ గా మారుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

    అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఫ్యాక్షనిస్టు రోల్ లో బాలయ్యను చూపించిన విధానం చూసి గోపీచంద్ మలినేనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య బాబు అధికార వైసిపి పార్టీపై పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న అరాచకాలపై బాలయ్య జూలు వేయించిన సింహంలా రెచ్చిపోయి విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో ఈ చిత్రంలో హోమ్ మినిస్టర్ కి బాలయ్య బాబు చెప్పే నిర్వచనం… ఆ సన్నివేశంలో బాలయ్య ఉపయోగించిన పదాలు, రైమింగ్ థియేటర్స్ లో ఆడియ‌న్స్‌చేత విజిల్స్ వేయించేలా చేసింది.

    దీంతో సోషల్ మీడియా వేదికగా వైసిపి పార్టీ అభిమానులు, కార్యకర్తలు బాలయ్య పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాలయ్యని జగన్ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాడని కానీ బాలయ్య మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏమీ బాగాలేదని వీరసింహారెడ్డిని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నినాదాలు చేస్తున్నారు. మరి ఈ వార్ ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాలి..!

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular