విధాత: నోటికొచ్చినట్లు మాట్లాడి అందర్నీ చిన్నచూపు చూసే బాలయ్య బాబు విషయంలో అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. అంటే అక్కినేని తొక్కినేని అంటూ నిన్న వ్యంగ్యంగా బాలయ్య మాట్లాడిన మాటలు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. లెజెండరీ నటుడు.. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత.. ఎన్టీఆర్‌తో సరిజోడైన నాగేశ్వరరావు కుటుంబాన్ని అక్కినేని.. తొక్కినేని అంటూ హేళనగా మాట్లాడడాన్ని అభిమాన సంఘాలు తీవ్రంగా పరిగణిస్తూ ఖండనలు ఇచ్చాయి. బాలయ్య ఇలా అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడడం దారుణమని అభిమాన సంఘాలు […]

విధాత: నోటికొచ్చినట్లు మాట్లాడి అందర్నీ చిన్నచూపు చూసే బాలయ్య బాబు విషయంలో అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. అంటే అక్కినేని తొక్కినేని అంటూ నిన్న వ్యంగ్యంగా బాలయ్య మాట్లాడిన మాటలు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

లెజెండరీ నటుడు.. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత.. ఎన్టీఆర్‌తో సరిజోడైన నాగేశ్వరరావు కుటుంబాన్ని అక్కినేని.. తొక్కినేని అంటూ హేళనగా మాట్లాడడాన్ని అభిమాన సంఘాలు తీవ్రంగా పరిగణిస్తూ ఖండనలు ఇచ్చాయి. బాలయ్య ఇలా అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడడం దారుణమని అభిమాన సంఘాలు ఖండించాయి

అయితే ఈ విషయంలో అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున కానీ సుశాంత్.. సుమంత్ ఎవరో ఒకరు స్పందిస్తారని అభిమానులు ఊహించారు. కానీ వాళ్ళెవరూ బాలయ్య కామెంట్స్ ను పట్టించుకోనట్లు ఉండిపోగా నాగచైతన్య మాత్రం రెస్పాండ్ అయ్యాడు.

రామారావు.. నాగేశ్వరరావు.. ఎస్వీ రంగారావు.. ఈ ముగ్గురూ కళామతల్లి ముద్దు బిడ్డలు.. వీళ్లను అగౌరవ పరచుకోవడం.. మనల్ని మనమే కించపరుచుకోవడం.. అంటూ అక్కడితో ఆపేశారు.. అంటే మిగతాది బాలయ్య విజ్ఞతకు వదిలేస్తున్నాను అన్నట్లుగా చురక వేశారు.

మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఓ రిటార్ట్ రావడం మంచి పరిణామం. లేదంటే బాలయ్య ఇలాగే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ గొప్పగా చెప్పానని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు దీనికి అడ్డు తగలాల్సిందే.. ఇన్నాళ్లకు ఇప్పుడు చైతూ రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురొచ్చింది. మరి బాలయ్య ఏమంటారో చూడాలి.

Updated On 25 Jan 2023 1:31 PM GMT
krs

krs

Next Story