Balineni సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు..ఆఖరుకు దివంగత వైఎస్సార్ కు సైతం సన్నిహితుడిగా ఉంటూ ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసి జగన్ వెంట నడిచి.. చివరకు అవమానాలు పాలైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అలక పోయినట్లేనా.. మళ్ళీ జగనప్పగించిన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనా.. అసలు ఇందాక జగన్ తో జరిపిన చర్చల ఫలితం ఏమిటి ? సీనియర్.. జాగన్ వెంట మొదటి నుంచీ నడవడమే కాదు వైఎస్సార్ మరణం తరువాత జగన్ కోసం […]

Balineni

సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు..ఆఖరుకు దివంగత వైఎస్సార్ కు సైతం సన్నిహితుడిగా ఉంటూ ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసి జగన్ వెంట నడిచి.. చివరకు అవమానాలు పాలైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అలక పోయినట్లేనా.. మళ్ళీ జగనప్పగించిన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనా.. అసలు ఇందాక జగన్ తో జరిపిన చర్చల ఫలితం ఏమిటి ?

సీనియర్.. జాగన్ వెంట మొదటి నుంచీ నడవడమే కాదు వైఎస్సార్ మరణం తరువాత జగన్ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారు బాలినేని.. ఆ తరువాత ఎమ్మెల్యేగా సైతం రాజీనామా చేసి గెలిచారు. అంతే కాదు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు కూడా ఆయనే అప్పట్లో. ఖర్చులు..బాధ్యతలు.. నాయకులమధ్య సర్దుబాటు. ఇవన్నీ ఈ పదేళ్ళలో ఆయనే చేశారు.

అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి దక్కలేదు. అంతేకాకుండా ఆ మధ్య ఒంగోలులో జరిగిన ఈబీసీ నేస్తం పథకం అమలు సభకు వస్తున్న బాలినేనికి పోలీసులు అనుమతి లేదంటూ హెలిప్యాడ్ దగ్గరకు రానివ్వ లేదు. ఆయన తరువాత వచ్చిన మంత్రి సురేష్ కు మాత్రం అనుమతి ఇచ్చి లోపలికి పంపారు. ఇది ఆయన్ను బాధించింది.. పార్టీని మొయ్యడానికి పనికొచ్చిన నేను మంత్రిగా పనికి రాలేదా అనుకున్నారో ఏమో..ఈ అవమానాలు ఎందుకులే అనుకుని సభ ప్రారంభానికి ముందే అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

కానీ సీఎం ఆయనకు ఫోన్ చేసి పిలిచిమరీ వేదిక మీద నుంచి ఆయనతో బటన్ నొక్కించారు. అయినా కోపం చల్లారని బాలినేని నెల్లూరు, కడప ..తిరుపతి జిల్లాల పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఇది పార్టీలో పెద్ద సంచలనానికి కారణం ఐంది. బాలినేని కానీ పార్టీ బాధ్యతలుకు దూరంగా ఉంటూ కేవలం తన ఒంగోలు నియోజక వర్గానికి పరిమితమైతే జిల్లాలో పార్టీని నడిపేవాళ్ళు కారువవుతారని, అది మూలం సురేష్ మంత్రిగా పనికొస్తారేమో కానీ జిల్లా మొత్తం పార్టీని నడపలేరని పార్టీ పెద్దలు భావించారు.

అందుకే మంగళవారం ఆయన్ను ప్రత్యేకించి జగన్ దగ్గరకు తీసుకొచ్చి మాట్లాడించారు. అవమానాలు భరిస్తూ తాను మూడు జిల్లాల కన్వీనర్ గా ఉండలేనని.. తన ఒంగోలు వరకూ చూసికుంటానని ఆయన జగన్ కు చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ మాత్రం ఆయన్ను బుజ్జగించినట్లు తెలిస్తోంది.

Updated On 2 May 2023 4:45 PM GMT
krs

krs

Next Story