HomelatestBalineni | పాపం బాలినేని.. కన్నీటి పర్యంతం..! ఆయన ఆరోపణలు ఎవరు మీదా. ?

Balineni | పాపం బాలినేని.. కన్నీటి పర్యంతం..! ఆయన ఆరోపణలు ఎవరు మీదా. ?

Balineni

విధాత‌: బాలినేని శ్రీనివాస రెడ్డి, వైఎస్సార్సీపీలో పరిచయం అక్కర్లేని నాయకుడు. ఆనాడు వైఎస్ మరణం తర్వాత ఐదేళ్లు పదవీకాలం ఉన్నాసరే పదవిని కాదనుకుని జగన్ వెంట నడిచిన నాయకుడు. జగన్ ఓదార్పు యాత్రతో పాటు షర్మిల పాదయాత్ర, ఉప ఎన్నికలు జగన్ సొంత పార్టీ పెట్టడం దాని కోసం తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఒంగోలు జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడిపించడం.. ఇవన్నీ చేస్తూ వచ్చారు.

కానీ జగన్ లెక్కలు జగన్‌కు ఉన్నాయ్.. అందుకే పార్టీని నడపడానికి మోయడానికి పనికొచ్చిన బాలినేని మంత్రిగా పనికిరాడు అనుకున్నారేదో మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో బాలినేని అభిమానులు కార్యకర్తల్లో ఇన్నాళ్ళుగా రాజసంతో తిరగలేక జిల్లాలో తన మాట చెల్లుబాటు కాక, కనీసం చిన్న పోస్టింగ్స్ కూడా వేయించుకోలేక అవమానంతో కుంగిపోతున్నారు. దానికి తోడు అయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

పార్టీ పెద్దలు తనను బదనాం చేస్తున్నారని, తనను, కొడుకును సైతం టార్గెట్ చేస్తిన్నారని బాధపడ్డారు. తన ఎదుగుదలకు బ్రేకులు వేస్తూ తమ పెద్దరికం చూపుతున్నారని ఆవేదన చెందారు. తానూ టిక్కెట్స్ ఇప్పించినవాళ్ళే తనమీద సీఎంకు పితూరీలు చెబుతున్నారని బాలినేని ఆరోపిస్తున్నారు. ఆయన ఆఖరుకు నిన్నమొన్న పార్టీలోకి వచ్చి మంత్రి అయిన ఆదిమూలం సురేష్ కన్నా లోకువ అయిపోవడంతో తన పరిస్థితిని తానే తట్టుకోలేకపోతున్నారు.

అయితే తనమీద సీఎం కు చాడీలు చెబుతున్నది వైవీ సుబ్బారెడ్డి అన్నది ఆయన అనుచరుల మాట. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి (టీడీడీ చైర్మన్ ) చెల్లెల్నే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ బావ బావమరుదులు అవుతారు. ఐతే జిల్లాలో బాలినేని ఉన్న పట్టు, గౌరవం సుబ్బారెడ్డికి లేదన్నది జనాల్లో ఉన్న మాట.

దీంతో శ్రీనివాసరెడ్డిని ఏదోలా బదనాం చేసి తన పెద్దరికాన్ని కంటిన్యూ చేయాలన్నది సుబ్బారెడ్డి ఆలోచన అని అంటున్నారు. లేకుంటే ఆ జిల్లాలో తనకు పొగబెట్టే దమ్ము ఎవరికీ ఉంటుందన్నది బాలినేని ప్రశ్న. అయన వెనుక వచ్చిన అనిల్ కుమార్ యాదవ్, ఆమంచి కృష్ణమోహన్ తదిరతులతో కూడా బాలినేని పొసగడం లేదు.

ఇక మంత్రి సురేష్ ఐతే బాలినేనిని లెక్క చేయడం లేదు.. మొన్నటి సీఎం ప్రోగ్రాం కు వెళుతున్న బాలినేనిని ఓ డిఎస్పీ అడ్డుకోవడం ఆయన్ను మరింత బాధకు గురిచేసింది. తాను హవాలా వ్యాపారాలు చేస్తున్నట్లు.. తప్పుడు కార్యకలాపాలు చేస్తున్నట్లు కొందరు పెద్దలు పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తూ తన పరువు తీస్తున్నారని బాలినేని ఆవేదన చెందుతున్నారు.

మొన్న బాలినేని వచ్చి సీఎం జగన్ను కలిసి మాట్లాడారు. పరిస్థితి ఏమైందో తెలియదు.. మొత్తానికి మూడు జిల్లాల (చిత్తూర్, నెల్లూరు, తిరుపతి) కోర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇంత వరకు బాలినేని నాలుగు సార్లు ఒంగోలు నుంచి 1999, 2004, 2009లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 లో వైఎస్ జగన్ కోసం రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలో గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఓడిపోయారు. కానీ మళ్ళీ 2019 లో గెలిచినా మంత్రిపదవి దక్కలేదు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular